Mumbai: ముంబై-ఆగ్రా హైవేపై ప్రమాదం... 10 మంది మృతి

Mumbai: ముంబై-ఆగ్రా హైవేపై ప్రమాదం... 10 మంది మృతి
బ్రేక్ ఫెయిల్ అయి ప్రాణాలు బలితీసుకున్న కంటైనర్

మహారాష్ట్రలోని ధూలేలో హైవేలో ట్రక్కు బ్రేక్ ఫెయిల్ అయ్యి ఇతర వాహనాల మీదకి దూసుకు వెళ్లిన సంఘటనలో పదిమంది చనిపోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాష్ట్ర రాజధానికి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ సంఘటనతో ఒక్కసారి ఆ ప్రాంతం ఉలిక్కి పడింది.

ముంబై-ఆగ్రా హైవే లోని పలాస్నర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర వస్తున్న ఓ కంటైనర్ బ్రేక్ ఫెయిల్యూర్ కారణంగా అదుపుతప్పి పలు వాహనాలను గుద్దేసింది. ఈ ఘటనలో 10మంది మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. సంఘటన జరిగిన వెంటనే ప్రమాద స్థలానికి సమీపంలోని గ్రామాల ప్రజలు చేరుకున్నారు. అటు పోలీసులకు, ఇటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికుల సహకారంతో క్షతగాత్రులను తరలించే పనులు నిర్వహించారు. ముంబై-ఆగ్రా హైవేపై ఉన్న పలాస్నేర్ గ్రామం మహారాష్ట్రలోని ధులే జిల్లాలోని షిర్పూర్ సమీపంలో ఉంది. ఈ ప్రాంతం మధ్యప్రదేశ్‌ రాజధానికి 300 కిలోమీటర్లు దూరంలో ఉంది. మధ్యాహ్నం 12 గంటల సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.




మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పలాస్నర్ గ్రామం సమీపంలో ముంబై-ఆగ్రా హైవే గుండా ఒక కంటైనర్ అతి వేగంతో వెళుతోంది. బ్రేక్ ఫెయిల్ కావడంతో అది తనపక్కనుంచి అప్పుడే క్రాస్ అయిన కార్ ను గుద్దుకుంటూ ముందుకు వెళ్ళింది. అక్కడే ఉన్న ఓ హోటల్‌లోకి ప్రవేశించడంతో హోటల్ బయట ఉన్న వాహనాలు డామేజ్ అయ్యాయి. సమీపంలో ఉన్న బస్ స్టాప్ లో బస్సు కోసం ఎదురుచూస్తున్న వారి వైపు కూడా వేగంగా వెళ్లడంతో అక్కడ ఉన్న వారిలో కొందరు గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ప్రమాదం తర్వాత నుంచి ఇప్పటి వరకు మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. పోలీసు బృందం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది.

Tags

Read MoreRead Less
Next Story