Bihar : ఎన్నికల ప్రచారంలో రామ్ చరణ్ హీరోయిన్

Bihar : ఎన్నికల ప్రచారంలో రామ్ చరణ్ హీరోయిన్

చిరుత హీరోయిన్ అనగానే గుర్తొచ్చే కొంటె అమ్మాయి నేహాశర్మ. బాలీవుడ్ లో ఈమె గ్లామర్ కు ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. నేహా శర్మ ఎన్నికల ప్రచారంలో సందడి చేస్తోంది. బీహార్‌లో ఓ రోడ్ షోలో పాల్గొంది. 'తుమ్ బిన్-2' మరియు 'క్రూక్' వంటి చిత్రాలలో ముఖ్యమైన పాత్రలు పోషించిన నేహా శర్మ.. కాంగ్రెస్ టిక్కెట్‌పై భాగల్‌పూర్ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేస్తున్న తన తండ్రి అజిత్ శర్మకు మద్దతుగా రోడ్ షోలో పాల్గొంది.

నేహాశర్మ తన రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించిన పుకార్లను కొట్టిపారేసింది. తండ్రి కోసం మాత్రమే ప్రచారం చేస్తున్నానని స్పష్టం చేసింది. నేహా శర్మ బంకా, కిషన్‌గంజ్, కతిహార్, పూర్నియాతో సహా బీహార్‌లోని వివిధ జిల్లాలలో తన ప్రయాణానికి సంబంధించిన వీడియోను పంచుకున్నారు.

సంప్రదాయ సల్వార్ కమీజ్ ధరించి ప్రజలకు అభివాదం చేస్తూ సందడిచేసింది నేహాశర్మ. భాగల్‌పూర్ లోక్‌సభ స్థానానికి రెండో దశలో ఏప్రిల్ 26న ఎన్నికలు జరగనున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story