SSC Website : కొత్త SSC వెబ్ సైట్.. అప్లై విధానంలో మార్పులు ఇవే!

SSC Website : కొత్త SSC వెబ్ సైట్..  అప్లై విధానంలో మార్పులు ఇవే!

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) బుధవారం నుంచి కొత్త వెబ్ సైట్ అందుబాటులోకి తెచ్చింది. వెబ్ సైట్ కు సంబంధించి చేసిన కీలక మార్పులు, ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ 2024 దరఖాస్తు మార్గదర్శకాలు తదితర వివరాలను వెల్లడించింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కు కొత్త వెబ్ సైట్ ssc.gov.in అందుబాటులోకి వచ్చిందని తెలిపింది. ఇప్పటివరకు ఉన్న వెబ్ సైట్ ssc.nic.in కూడా అందుబాటులోనే ఉంటుందని స్పష్టం చేసింది.

ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ 2024 ను కొత్త వెబ్సైట్ ssc.gov.in లోనే విడుదల చేస్తామని, అభ్యర్థులు ఈ కొత్త ssc.gov.in వెబ్సైట్ ద్వారానే తమ దరఖాస్తు ఫారాలను సమర్పించాలని ఎస్ఎస్సీ తెలిపింది. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు తమ OTRను కొత్త వెబ్సైట్ ssc.gov.in లో జనరేట్ చేయాల్సి ఉంటుంది. గత వెబ్సైట్ ssc.nic.in లో జనరేట్ చేసిన ఓటీఆర్.. కొత్త వెబ్ సైట్ లో పనిచేయదు.

10+2 లెవల్ ఎగ్జామినేషన్, 2024 నోటిఫికేషన్ విడుదలకు ముందే అభ్యర్థులు వీలైనంత త్వరగా ఓటీఆర్ పూర్తి చేసుకోవాలని ఆ ప్రకటనలో SSC తెలిపింది. ఎస్ఎస్సీ కొత్త వెబ్సైట్ ssc.gov.in లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు, అభ్యర్థుల లైవ్ ఫోటోలను క్యాప్చర్ చేసే అవకాశం ఉంటుందని అభ్యర్థులు గమనించాలి. మునుపటి వెబ్సైట్లో అప్లికేషన్ ను సబ్మిట్ చేయడంలో, కొత్త వెబ్ సైట్ లో అప్లికేషన్ ను సబ్మిట్ చేయడంతో కొన్ని తేడాలున్నాయి. కొత్త SSC వెబ్ సైట్ ssc.gov.in లో దరఖాస్తు ప్రక్రియలో భాగంగా లైవ్ ఫొటో క్యాప్చర్ చేస్తారు. లైవ్ ఫొటోను క్యాప్చర్ చేయడానికి అభ్యర్థులు కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ లో వెబ్ క్యామ్ లేదా ఆండ్రాయిడ్ డివైజ్ ను ఉపయోగించవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story