బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. నలుగురు మృతి

బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. నలుగురు మృతి
వచ్చే దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని బాణాసంచా తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో పేలుడు సంభవించింది.

తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో బాణాసంచా తయారీలో పేలుడు సంభవించడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దీపావళికి నెల రోజులు మాత్రమే ఉండడంతో ఆ ప్రాంతానికి చెందిన కార్మికులు పటాకుల తయారీలో నిమగ్నమయ్యారు. ఉత్పత్తి సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో, తయారు చేస్తున్న పేలుడు పదార్థాలు పెద్ద శబ్దంతో పేలి నలుగురు కార్మికులు మరణించారు.

సుమారు 100 మీటర్ల మేర మృతదేహాల భాగాలు చెల్లాచెదురుగా పడి ఉండడంతో పోలీసులు గుర్తించలేకపోయారు. "ఘటన సమయంలో ఫ్యాక్టరీలో ఎనిమిది మంది ఉన్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం నాగపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని ఎస్పీ హరీష్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story