NIA : బెంగళూరు పేలుళ్ల సూత్రధారులకు పాక్‌తో లింక్‌ : ఎన్‌ఐఏ

NIA : బెంగళూరు పేలుళ్ల సూత్రధారులకు పాక్‌తో లింక్‌ : ఎన్‌ఐఏ

బెంగళూరు రామేశ్వరం కెఫేలో బాంబు పేలుళ్ల సూత్రధారులకు పాకిస్థాన్‌తో సంబంధాల ఉన్నట్టు ఎన్‌ఐఏ విచారణలో తేలింది. పాకిస్థాన్‌కు చెందిన కర్నల్‌ అనే కోడ్‌ పేరు కలిగిన వ్యక్తితో.. బాంబు పేలుళ్ల సంఘటనలో అరెస్టు అయిన అబ్దుల్‌ మతిన్‌ తాహా, ముసావీర్‌ హుసేన్‌ షజిబ్‌కు సంబంధాలున్నట్టు అధికారులు నిర్థారించుకున్నారు.

ఐఎస్‌ అల్‌–హింద్‌ అనే ఉగ్రవాద సంస్థతోనూ వీరికి 2019–20 నుంచి సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. కర్నల్‌ అనే కోడ్‌ ఉన్న అనుమానితుడితో 2022లో మంగళూరులో జరిగిన కుక్కర్‌బాంబు పేలుళ్ల కేసు నిందితుడికి సంబంధాలు ఉన్నట్టు ఉన్నత వర్గాల ద్వారా తెలుస్తోంది. కర్నల్‌కు పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్నట్టు సమాచారం. వీరు భారత్‌లో బాంబు పేలుళ్లకు కుట్రలు సాగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.

ఇస్లామిక్‌ స్టేట్‌ పేరిట స్థానిక యువతను కర్నల్‌ నియమించుకుంటున్నాడు. వారితో దేశవ్యాప్తంగా గ్రూపులను ఏర్పాటు చేసి, బాంబు దాడులు జరపడానికి ఆ వ్యక్తి కుట్రలు చేస్తున్నాడు. రామేశ్వరం కెఫేలో మార్చి 1న సంభవించిన పేలుళ్ల వెనుక అతని హస్తం ఉన్నట్టు గుర్తించిన ఎన్‌ఐఏ దర్యాప్తు మరింత వేగవంతం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story