NIA : ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరచనున్న ఎన్ఐఏ

NIA : ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరచనున్న ఎన్ఐఏ

బెంగుళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 12న అరెస్టయిన ఇద్దరు కీలక నిందితులను ఈరోజు బెంగళూరు కోర్టులో హాజరుపరచనున్నారు. అద్బుల్ మతీన్ అహ్మద్ తాహా, ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్‌లను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసిన తర్వాత నిన్న సాయంత్రం బెంగళూరుకు తీసుకువచ్చారు.

కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లోని 18 ప్రదేశాలలో అధికారులు సోదాలు నిర్వహించిన తర్వాత, కోల్‌కతా నుండి 180 కి.మీ దూరంలో ఉన్న కంఠి లేదా కొంటాయ్ అనే చిన్న నగరానికి షాజేబ్, తాహాను గుర్తించారు. నిందితులు అద్బుల్ మతీన్ అహ్మద్ తాహా, ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్‌లు బెంగాల్‌లోని ఓ లాడ్జిలో ఉంటున్నారని అధికారులు తెలిపారు.

కోల్‌కతాలోని కోర్టు నిన్న ఇద్దరు వ్యక్తులకు 3 రోజుల ట్రాన్సిట్ రిమాండ్‌ను మంజూరు చేసింది. వారిని బెంగళూరుకు తీసుకెళ్లడానికి NIA అనుమతించింది. "షాజీబ్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED)ని కేఫ్‌లో ఉంచగా, పేలుడు వెనుక తాహా ప్రధాన సూత్రధారి" అని అధికారులు తెలిపారు.

మార్చి 1న ప్రసిద్ధ బెంగళూరు కేఫ్‌లో పేలుడు సంభవించిన్నప్పటి నుండి ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారు. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. కాగా ఈ కేసుపై NIA మార్చి 3న విచారణను చేపట్టింది. నిందితుడిని అరెస్టు చేయడానికి దారితీసే సమాచారం కోసం రూ. 10 లక్షల రివార్డును కూడా ప్రకటించింది.

Tags

Read MoreRead Less
Next Story