EC : ఇంటి నుంచే నామినేషన్ వేయొచ్చు..ఈసీ బంపరాఫర్

EC : ఇంటి నుంచే నామినేషన్ వేయొచ్చు..ఈసీ బంపరాఫర్

ఎన్నికల ప్రక్రియను సులభతరం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం టెక్నాలజీని వినియోగిస్తోంది. ఈ మేరకు ‘సువిధ’ యాప్‌ తీసుకొచ్చింది. దీని ద్వారా ఓటు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇంటి నుంచే నామినేషన్ వేయవచ్చు. ఆన్‌లైన్‌లో పత్రాలు సమర్పించిన తర్వాత ప్రింట్ తీసి.. మూడు సెట్లు జిల్లా అధికారికి అందించాలి. అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు మద్దతుదారులతో కలిసి ర్యాలీగా వెళ్లడం, ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసుకోవడం లాంటి ఖర్చుతో కూడుకన్న వాటిని తగ్గించేందుకు ప్రత్యేకంగా సువిధ యాప్‌ను ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చింది.

48 గంటల్లోనే ప్రచార అనుమతులు

* ఫోన్లో గూగుల్‌ ప్లేస్టోర్‌ ద్వారా సువిధ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

* సమావేశం నిర్వహించే వివరాలతో పాటు తమకు ఏ విధమైన అనుమతులు కావాలో అందులో నమోదు చేయాలి.

* అనుమతులకు సంబందించి మీ సేవా కేంద్రంలో చలానా చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించిన చలానా రసీదు సువిధలో నమోదు చేసిన వివరాలు రిటర్నింగ్‌ అధికారి, అసెంబ్లీ పరిధిలోని ఏఆర్వో కార్యాలయాల్లో అందజేయాలి.

* ఎలాంటి జాప్యం లేకుండా దరఖాస్తులు ఎన్నికల అధికారులకు చేరిన 48 గంటల్లో అనుమతులు జారీ చేస్తారు. అనుమతి జారీలో జాప్యం జరిగితే..సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి దరఖాస్తు చేసుకోవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story