జమ్మూ నుండి అయోధ్యకు ప్రత్యేక రైలు..

జమ్మూ నుండి అయోధ్యకు ప్రత్యేక రైలు..
దేశం నలుమూలల నుండి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు నడుప తలపెట్టింది కేంద్ర ప్రభుత్వం..

దేశం నలుమూలల నుండి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు నడుప తలపెట్టింది కేంద్ర ప్రభుత్వం.. ఆలయ ప్రారంభోత్సవం మొదలు భక్తులు ప్రతి రోజు వేల సంఖ్యలో రాముల వారిని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్ నుండి అయోధ్యకు ప్రత్యేక రైలును ప్రారంభించేందుకు భారతీయ రైల్వే శాఖ సిద్ధంగా ఉంది. తాజా షెడ్యూల్ ప్రకారం, రైలు ఉదయం 11 గంటలకు ప్రారంభించబడుతుంది. జమ్మూ నుండి అయోధ్యకు ఇది మొదటి ప్రత్యేక రైలు.

గత నెల, అయోధ్యకు యాత్రికులు భారీగా తరలి రావడంతో జమ్మూ కాశ్మీర్ నుండి అయోధ్యకు బయలుదేరాల్సిన నాలుగు ఆస్తా ప్రత్యేక రైళ్లను భారతీయ రైల్వే రద్దు చేసింది.

అయోధ్యలో ప్రస్తుతం ఉన్న భారీ రద్దీని పరిగణనలోకి తీసుకుని ఈ రైళ్లను రీషెడ్యూల్ చేయనున్నట్లు తెలియజేశారు. అయోధ్యలోని రామ మందిర సందర్శనల కోసం అధిక డిమాండ్ ఉన్న ఈ కాలంలో యాత్రికుల భద్రత మరియు సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొద్ది రోజులపాటు రైళ్లను రద్దు చేసింది.

రామాలయ శంకుస్థాపన తర్వాత అయోధ్యకు 200కు పైగా ఆస్తా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు భారతీయ రైల్వే గతంలో ప్రకటించింది. భారతదేశంలోని వివిధ నగరాలు, పట్టణాల నుండి అయోధ్య ధామ్ కు చేరుకునేందుకు భక్తులకు వెసులుబాటు కల్పించింది. రామ మందిరం భక్తుల కోసం తెరిచిన 100 రోజుల పాటు తిరిగి వెళ్లే ఈ రైలులో ఆపరేషనల్ స్టాప్‌లు మాత్రమే ఉంటాయని రైల్వే తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story