PM Modi Comments : రాజ్యాంగ నిర్మాతల్లో 90శాతం మంది సనాతనీలే.. మోదీ హాట్ కామెంట్

PM Modi Comments : రాజ్యాంగ నిర్మాతల్లో 90శాతం మంది సనాతనీలే.. మోదీ హాట్ కామెంట్

రాజ్యాంగంలో మార్పుల గురించి దేశమంతటా చర్చ జరుగుతోంది. బిహార్ లో ప్రచారం సందర్భంగా మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని దూషించే వాళ్లు ఒక్క విషయం తెలుసుకోవాలని అన్నారు. రాజ్యాంగ రూపకర్తల్లో 80 నుంచి 90 శాతం మంది సనాతన ధర్మాన్ని గౌరవించే వారే ఉన్నారని అన్నారు. ఈ గొప్ప రాజ్యాంగాన్ని అంబేదర్కర్‌ తీర్చిదిద్దేందుకు వీరు మద్దతుగా నిలిచారని చెప్పారు.

రాజ్యాంగ నిర్మాతలు దేశ అభివృద్ధి కోసం కలలు కని రాజ్యాంగాన్ని అందిస్తే.. కాంగ్రెస్‌ సద్వినియోగం చేసుకోలేకపోయిందని విమర్శించారు మోడీ. రాజ్యాంగంలో సవరణలు చేపట్టేందుకే బీజేపీ భారీ మెజార్టీని కోరుకుంటోందన్న ప్రతిపక్షాల విమర్శలకు ప్రధాని మోదీ కౌంటర్‌ ఇచ్చారు.

ఎన్డీఏ రాజ్యాంగాన్ని గౌరవిస్తుందని, అంబేద్కర్‌ కూడా రాజ్యాంగాన్ని ఇప్పుడు మార్చలేరని అన్నారు మోడీ. తనను దూషించేందుకు ప్రతిపక్షాలు రాజ్యాంగం పేరును వాడుకుంటున్నాయని అన్నారు. అంబేద్కర్‌, డా.రాజేంద్రప్రసాద్‌ తీర్చిదిద్దిన రాజ్యాంగమే తనను ప్రధానమంత్రిని చేసిందన్నారు. ప్రతిపక్షాలు రాజ్యాంగంతో రాజకీయాలు చేస్తున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story