Kolkata : అండర్ వాటర్ మెట్రో రైలులో స్టూడెంట్స్ తో మోదీ

Kolkata : అండర్ వాటర్ మెట్రో రైలులో స్టూడెంట్స్ తో మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కోల్‌కతాలో రూ. 15,400 కోట్ల విలువైన పలు కనెక్టివిటీ ప్రాజెక్టులను ప్రారంభించారు, కొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఈ రోజు ప్రారంభించిన భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో రైలులో పాఠశాల విద్యార్థులతో కలిసి ఆయన ప్రయాణించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్, WB LoP, బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారితో కలిసి భారతదేశపు మొట్టమొదటి నీటి అడుగున మెట్రో రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ప్రధానమంత్రి మెట్రో సిబ్బందితో సంభాషించారు. అంతకుముందు కోల్‌కతాలో 'మోదీ మోదీ', 'జై శ్రీ రామ్' నినాదాల మధ్య పెద్ద సంఖ్యలో మద్దతుదారులు ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికారు.

మెట్రో రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కౌసిక్ మిత్రా మాట్లాడుతూ.. కోల్‌కతా ప్రజలకు ఇది మన ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన కానుక అని, చిరకాల వాంఛ ఈ ప్రారంభోత్సవంతో సాకారం కాబోతోందని చెప్పారు.

భారతదేశపు మొదటి అండర్ వాటర్ మెట్రో

కోల్‌కతాలోని హౌరా మైదాన్, ఎస్ప్లానేడ్ మధ్య మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఇది భారతదేశపు మొట్టమొదటి అండర్ రివర్ టన్నెల్. ఇది దాదాపు 53 సంవత్సరాల క్రితం నగరవాసులు కన్న కలలను నెరవేరుస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story