పెళ్లి నెమ్మదిగా చేశాడని..! పూజారిని కొట్టిన ఖాకీ పెళ్లికొడుకు

పెళ్లి నెమ్మదిగా చేశాడని..! పూజారిని కొట్టిన ఖాకీ పెళ్లికొడుకు

తన పెళ్లివేడుకలోనే ఓ పోలీస్ పెళ్లికొడుకు రెచ్చిపోయాడు. వివాహ వేడుకలను నిదానంగా జరిపినందుకు పూజారిని పోలీసు కానిస్టేబుల్ కొట్టాడు. ఈ ఘటన బుధవారం లక్నోలోని నిగోహన్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

కానిస్టేబుల్ తన వివాహాన్ని ఘనంగా నిర్వహించేందుకు పూజారిని పిలిచారు. నిగోహన్ పోలీస్ స్టేషన్‌ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ సోను జాతవ్ వివాహం స్థానికుడైన ఓం ప్రకాష్ ప్రజాపతి కుమార్తెతో జరిగింది. ఆచారాలను త్వరగా చేయమని పూజారి వివేక్ శుక్లాను పెళ్లికొడుకు జాతవ్ కోరాడు. పంతులు నిరాకరించాడు. దీంతో.. వాదోపవాదాలు పెరిగి ఉద్రిక్తత ఏర్పడింది. వేడుకను హడావిడిగా ముగించేందుకు పూజారి నిరాకరించడంతో ఆగ్రహించిన పోలీసులు అతిథుల సమక్షంలోనే పూజారిని కొట్టారు.

వివేక్ శుక్లా సోదరుడు సచిన్ జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించాడు. మధ్యలో ఎందుకు వస్తున్నావంటూ అతడికి కూడా తగిలించాడు ఆ ఖాకీ. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని పూజారి, అతని సోదరుడిని జాతవ్ బెదిరించాడు. కానిస్టేబుల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story