Bharat Ratna Award : నేడు రాష్ట్రపతి భవన్‌లో భారతరత్న అవార్డుల ప్రదానోత్సవం

Bharat Ratna Award : నేడు రాష్ట్రపతి భవన్‌లో భారతరత్న అవార్డుల ప్రదానోత్సవం

భారత అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ప్రదానోత్సవ వేడుక నేడు రాష్ట్రపతి భవన్‌లో జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అవార్డులు అందించనున్నారు. ఈ ఏడాది ఐదుగురు ప్రముఖులకు భారత రత్న ప్రకటించింది.

బిహార్ మాజీ ముఖ్యమంత్రి, సోషలిస్టు నాయకుడు కర్పూరి ఠాకూర్, మాజీ ప్రధాని, దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా పేరొందిన పీవీ నరసింహారావు, మాజీ ప్రధాని, వ్యవసాయ రంగం పటిష్టం చేసేందుకు కృషి చేసిన జాట్ నేతగా పేరొందిన చౌదరి చరణ్ సింగ్, దేశంలో వ్యవసాయ విప్లవ పితామహుడిగా పేరొందిన వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్ఎస్ స్వామినాథన్‌లకు భారత రత్న అవార్డు ప్రకటించింది కేంద్రం.

దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న.. కళ, సాహిత్యం, సైన్స్, ప్రజా సేవ, క్రీడలు వంటి దేశసేవలకు ఈ గౌరవం ఇవ్వబడుతుంది. తమ రంగంలో ముఖ్యమైన పని, సహకారం ద్వారా దేశానికి కీర్తిని తెచ్చే వ్యక్తులకు భారతరత్న ప్రదానం చేస్తారు.

Tags

Read MoreRead Less
Next Story