Manifesto : ఇది రైతులు, మహిళలు, శ్రామికుల మేనిఫెస్టో: రాహుల్ గాంధీ

Manifesto : ఇది రైతులు, మహిళలు, శ్రామికుల మేనిఫెస్టో: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ (Congress) రిలీజ్ చేసింది రైతులు, మహిళలు, శ్రామికుల మేనిఫెస్టో అని రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడాకే మేనిఫెస్టోను రూపొందించినట్లు చెప్పారు. ఎన్నికల బాండ్ల ద్వారా బీజేపీ నిధులెలా సమకూర్చుకుందో బయటపడిందన్నారు. పొలిటికల్, ఫైనాన్షియల్ ప్రయోజనాల కోసం సీబీఐ, ఈడీని ప్రయోగించి బెదిరింపులకు పాల్పడిందని రాహుల్ విమర్శించారు.

పార్లమెంట్ ఎన్నికల తరువాతే ఇండియా కూటమి పీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మేనిఫెస్టోను విడుదల అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్.. లోక్‌సభ ఎన్నికలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్న శక్తులకు, వాటిని రక్షించే శక్తులకు మధ్య జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో గెలుస్తామని రాహుల్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాము సైద్ధాంతికంగా పోరాడుతున్నామన్నారు రాహుల్.

కాంగ్రెస్ మేనిఫెస్టోలో కీలక హామీలు ఇచ్చింది. స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదనల ప్రకారం ఏటా పంటకు కనీస మద్దతు ధర ఇస్తామని పేర్కొంది. దాదాపు 30 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపింది. అంతేకాకుండా రాజస్థాన్ ప్రభుత్వం అమలు చేస్తున్న రూ.25 లక్షల క్యాష్ లెస్ ఇన్సూరెన్స్‌ను దేశవ్యాప్తంగా తీసుకొస్తామని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంది. మహాలక్ష్మి పథకం కింద పేద మహిళలకు ఏడాదికి రూ.లక్ష ఇస్తామని ప్రకటించింది. విద్యార్థులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తామని చెప్పింది.

Tags

Read MoreRead Less
Next Story