AKHILESH YADAV: చంద్రబాబు అరెస్ట్‌ చట్ట విరుద్ధం

AKHILESH YADAV: చంద్రబాబు అరెస్ట్‌ చట్ట విరుద్ధం
బాబు అరెస్ట్ పై అఖిలేష్ యాదవ్ స్పందన

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టును ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఖండించారు. అరెస్టు చట్టవిరుద్ధమని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టు... అనంతర పరిణామాలను తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడుకు ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులతో మాట్లాడతానని అఖిలేష్ తెలిపారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టును..... బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్పుపట్టారు. చంద్రబాబు అరెస్టు....... కక్ష సాధింపులా కనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు. ఏదైనా తప్పు జరిగితే విచారణ జరపాలన్న ఆమె...... కక్షసాధింపు ధోరణి సరికాదన్నారు. రాబోయే రోజుల్లో.. ఇది బూమ్ రాంగ్ అవుతుందని తెలిపారు. బంగాల్ లో అభిషేక్ బెనర్జీని కూడా కేంద్ర ప్రభుత్వం ఇలాగే వేధిస్తోందని మమత బెనర్జీ ఆరోపించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై ఇండియా కూటమి నేతలు స్పందిస్తున్నారు. ముందుగా పశ్చిమబెంగాళ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనూహ్య రీతిలో టీడీపీ చీఫ్ అరెస్ట్‌పై స్పందించారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు సరికాదని అన్నారు. ఇప్పుడు తాజాగా యూపీ మాజీ సీఎం, ఎస్పీ (సమాజ్ వాది పార్టీ) అధినేత అఖిలేష్ యాదవ్ చంద్రబాబు అరెస్ట్‌పై ట్వీట్ చేశారు. ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడం ఇప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు ట్రెండ్‌గా మారిందన్నారు. అధికారంలోకి రాని వారిని జైల్లో పెట్టడం నిరంకుశ పాలకుల విధానమని.. ప్రజాస్వామ్యంలో దీనికి తావు లేదని తెలిపారు. రాజకీయాల్లో ఇలాంటి విషయాలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని బీజేపీ , వారి అవకాశవాద స్నేహితులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. స్వార్థపూరిత బీజేపీ ఎవరికీ రాజకీయ మిత్రుడు కాదంటూ చంద్రబాబును టాగ్ చేస్తూ అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన ఇండియా కూటమిలోని రెండవ నేత అఖిలేష్ యాదవ్.



Tags

Read MoreRead Less
Next Story