Ramzan : కనిపించిన నెలవంక.. నేడే రంజాన్

Ramzan : కనిపించిన నెలవంక.. నేడే రంజాన్

నిన్న రాత్రి ఆకాశంలో నెలవంక కనిపించడంతో ముస్లింలు అత్యంత పవిత్రంగా పాటించిన రంజాన్ మాస ఉపవాస దీక్షలు ముగిశాయి. దీంతో ఇవాళ రంజాన్(ఈద్ ఉల్ ఫితర్) జరుపుకోనున్నారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలు ముస్లింలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మానవ సేవ అత్యున్నతమైనదని చాటి చెప్పే ఈ పండుగ లౌకిక వాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు.

ఈరోజు చందమామ కనిపించడంతో రేపు దేశవ్యాప్తంగా ముస్లింలు ఈద్‌ను జరుపుకోనున్నారు. ఈక్రమంలో హైదరాబాద్‌లోని చార్మినార్ మార్కెట్లు జనంతో నిండిపోయాయి. గాజులు, అత్తర్లు సహా మహిళలు ఇష్టంగా కొనుగోలు చేసే పలు రకాలైన అలంకరణ వస్తువులు, దుస్తులు అక్కడ లభిస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రంజాన్ మాసంలో కులమతాలకు అతీతంగా అక్కడ జనం షాపింగ్‌ చేస్తుంటారు.

ఇస్లామిక్ క్యాలెండర్లో 9వ నెలను అరబిక్‌లో రంజాన్ అంటారు. నెలవంక దర్శనంతో ఇది మొదలవుతుంది. 29-30 రోజులుండే ఈనెలను పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ నెలలో ఖురాన్ పఠనానికి ప్రాధాన్యం ఇస్తారు. నెలంతా సూర్యోదయానికి ముందే నిద్రలేచి భోజనం ముగిస్తారు. దీనినే సుహుర్/సెహ్రి అంటారు. సూర్యాస్తమయం తర్వాత ఉపవాసం ముగిస్తారు. అప్పుడు చేసే విందునే ఇఫ్తార్/ఫితూర్ అంటారు. ఉపవాసాలను ముగించడాన్ని ఈద్‌ ఉల్‌ ఫితర్‌ అంటారు.

Tags

Read MoreRead Less
Next Story