Trains : వేసవి రద్దీ.. రైల్వే 9,111 అదనపు ట్రిప్పులు

Trains : వేసవి రద్దీ.. రైల్వే 9,111 అదనపు ట్రిప్పులు

వేసవిలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. గత ఏడాది 6,369 అదనపు ట్రిప్పులు నడపగా, ఈసారి ఆ సంఖ్యను 9,111కు పెంచినట్లు పేర్కొంది. వీలైనంత ఎక్కువ మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామంది. పశ్చిమ రైల్వే అత్యధికంగా 1,878 ట్రిప్పులు, దక్షిణ మధ్య రైల్వే 1,012 ట్రిప్పులు నడపనుంది.

అత్యధికంగా పశ్చిమ రైల్వే నుంచి 1878 ట్రిప్పులు ఉన్నాయి. వాయువ్య రైల్వే (1623), దక్షిణ మధ్య రైల్వే (1012), తూర్పు మధ్య రైల్వే (1003) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మీడియా కథనాలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, రైల్వే ఇంటిగ్రేటెడ్ హెల్ప్‌లైన్ నంబర్ ‘139’, ప్యాసింజర్‌ రిజర్వేషన్‌ సిస్టమ్‌ వంటి వేదికల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా డిమాండ్‌ను అంచనా వేసినట్లు రైల్వేశాఖ తెలిపింది.

ఈ సంఖ్య స్థిరంగా ఉండదని.. డిమాండ్‌కు అనుగుణంగా మరిన్ని రైళ్లు, ట్రిప్పులను పెంచుతామని వెల్లడించింది. ప్రయాణికుల భద్రత, తాగునీటి లభ్యత, రద్దీ నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. రైల్వే శాఖ నోటిఫై చేసిన ట్రిప్పుల వివరాలివే..

Tags

Read MoreRead Less
Next Story