Summer Special Trains : వేర్వేరు ప్రాంతాల నుంచి వేసవి ప్రత్యేక రైళ్లు

Summer Special Trains : వేర్వేరు ప్రాంతాల నుంచి వేసవి ప్రత్యేక రైళ్లు

వేర్వేరు ప్రాంతాల నుంచి వెళ్లి, వచ్చే ప్రయాణికుల డిమాండ్‌ మేరకు ప్రత్యేక రైళ్లను నడుపడానికి ఏర్పాట్లు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుదవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 28 వరకు సికింద్రాబాద్‌ నుంచి సంత్రగచ్చి వరకు ప్రత్యేక రైలు(07223) ప్రతి శుక్రవారం 11 ట్రిప్పులు, ఏప్రిల్‌ 20 నుంచి జూన్‌ 29 వరకు సంత్రగచ్చి నుంచి సికింద్రాబాద్‌ వరకు ప్రత్యేక రైలు(07224) ప్రతి శనివారం 11 ట్రిప్పులు, సికింద్రాబాద్‌ నుంచి షాలిమార్‌ వరకు ప్రత్యేక రైలు(07225) ప్రతి సోమవారం 11 ట్రిప్పులు, ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 24 వరకు షాలిమార్‌ నుంచి సికింద్రాబాద్‌ వరకు ప్రత్యేక రైలు(07226) ప్రతి మంగళవారం ఏప్రిల్‌ 16 నుంచి జూన్‌ 25 వరకు 11 ట్రిప్పులు, సికింద్రాబాద్‌–కొల్లం మధ్య 22 ట్రిప్పులు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు అధికారులు వివరించారు. ఏప్రిల్‌ 17, 24, మే 1, 8, 15, 22, 29, జూన్‌ 5, 12, 19, 26 తేదీల్లో సికింద్రాబాద్‌–కొల్లం ప్రత్యేక రైలు(07193) ప్రతి బుధవారం నడుస్తుందని తెలిపారు. అలాగే ఏప్రిల్‌ 19, 26, మే 3, 10, 17, 24, 31, జూన్‌ 7, 14, 21, 28 తేదీల్లో కొల్లం–సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు ప్రతి శుక్రవారం నడుస్తుందని రైల్వే అధికారులు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story