RBI : నెలాఖరు సండే బ్యాంకులు పనిచేస్తాయి.. ఆర్బీఐ కీలక ఆదేశాలు

RBI : నెలాఖరు సండే బ్యాంకులు పనిచేస్తాయి.. ఆర్బీఐ కీలక ఆదేశాలు

ఈ ఏడాది మార్చి 31 ఆదివారం కూడా బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి. ఈ మేరకు బుధవారం రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన విడుదల చేసింది. మార్చి 31 ఆదివారం ప్రభుత్వ రంగ PSU బ్యాంకులన్నీ యథావిధిగా సేవలు అందిస్తాయని ఆర్బీఐ ప్రకటించింది. ఆర్ధిక సంవత్సరం ముగింపు రోజు ఆదివారం రావడంతో ఆర్‌బిఐ ఈ నిర్ణయం తీసుకుంది.

దేశవ్యాప్తంగా ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించే బ్యాంకుల శాఖలు యథావిధిగా పనిచేయాలని ఆర్‌బిఐ సూచించింది. సాధారణంగా మార్చి 31న ఫైనాన్షియల్ ఇయర్ ముగిసిన తర్వాత ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవుగా పరిగణిస్తాయి. బ్యాంకు డాక్యుమెంట్ల ఆడిటింగ్‌ కోసం ఏప్రిల్ 1న లావాదేవీలు నిర్వహించారు.

ఈ ఏడాది మార్చి 31 ఆదివారం రావడంతో ఆ రోజు పనిచేయాలని ఆర్‌బిఐ ఆదేశించింది. ఆర్ధిక సంవత్సరం ముగింపు సందర్భంగా ప్రభుత్వ లావాదేవీలను, ఖాతాల్లోకి నగదు చెల్లింపులు, జమలను యథావిధిగా కొనసాగించాలని, 2023-34 ఆర్ధిక సంవత్సరం ముగింపు సందర్భంగా లావాదేవీలు జరపాలని సూచించింది. ఆర్‌బిఐ ఆదేశాలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఆదివారం యథావిధిగా పనిచేయనున్నాయి. ప్రభుత్వ బ్యాంకులతో పాటు ఆర్‌బిఐ పరిధిలో లావాదేవీలు నిర్వహించే షెడ్యూల్డ్‌ బ్యాంకులు తమ శాఖలు పనివేళల్లో లావాదేవీలను యథాతథంగా కొనసాగించాలని ఆర్‌బిఐ సూచించింది. మార్చి 31న అన్ని శాఖలను తెరిచి ఉంచాలని ఏజెన్సీ బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది.

Tags

Read MoreRead Less
Next Story