Black Magic : బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారనే అనుమానంతో గ్రామ బహిష్కరణ

Black Magic : బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారనే అనుమానంతో గ్రామ బహిష్కరణ

Odisha : ఒడిశాలోని రాయగడ జిల్లాలోని నందుబడిలో 18 మంది నివాసితులు గ్రామం నుంచి వెలివేయబడ్డారు. తీవ్రమైన జ్వరంతో ఓ చిన్నారి మృతి చెందడంతో చేతబడి చేశారనే అనుమానంతో కుటుంబాన్ని బలవంతంగా గ్రామం నుండి బహిష్కరించినందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. గ్రామానికి చెందిన 18 మంది వ్యక్తులపై రాయగడ పోలీసులు చాంద్లీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి బాధితులను వెనక్కి తీసుకురావాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

గ్రామస్తుల భయంతో కొందరు కుటుంబ సభ్యులు అడవిలో తలదాచుకోగా, మరికొందరు బంధువులు, స్నేహితులను ఆశ్రయిస్తున్నారు. గ్రామస్థులపై శారీరక, మానసిక వేధింపులకు సంబంధించిన లిఖితపూర్వక ఫిర్యాదుపై స్పందించిన జిల్లా మేజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, స్థానిక పోలీసులు జోక్యం చేసుకుని సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు.

రాయగడ పోలీస్ సూపరింటెండెంట్, హరీష్ బిసి మాట్లాడుతూ, "ఫిబ్రవరి 16, 2024 న, ఒక కుటుంబాన్ని బలవంతంగా ఖాళీ చేయిస్తున్నట్లు మాకు సమాచారం అందింది. చాందిని పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను రక్షించి, 18 మంది వ్యక్తులపై కేసు నమోదు చేశారు. . నోటీసులు అందజేశాం. మంత్రగత్తెలనే నేపంతో చట్టపరమైన పరిణామాలకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయి. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ప్రస్తుతం, బాధితులు బంధువుల వద్ద ఉంటున్నారు. వారు ఇంటికి తిరిగి వచ్చేలా చూస్తాము". బాధితురాలు మక్తి మందగి తెలిపిన వివరాల ప్రకారం.. మాయమాటలు చెబుతున్నారని ఆరోపిస్తూ గ్రామస్థులు కొడవళ్లు, కర్రలు, కత్తులు, ఇతర ఆయుధాలతో అర్ధరాత్రి తన కుటుంబంపై దాడి చేశారు. గత ఏడాది తేరుబలి పోలీస్ స్టేషన్‌లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story