రామ్ నామి తెగ.. రాముని పూజించరు.. కానీ ఒళ్లంతా..

రామ్ నామి తెగ.. రాముని పూజించరు.. కానీ ఒళ్లంతా..
రామనామి సమాజ్ భారతదేశంలోని ఛత్తీస్‌గఢ్‌లో నివసిస్తున్న ప్రజల సమూహం.

రామనామి సమాజ్ భారతదేశంలోని ఛత్తీస్‌గఢ్‌లో నివసిస్తున్న ప్రజల సమూహం. వారు ఒళ్లంతా రామ్ రామ్ అని పచ్చబొట్లు వేయించుకుంటారు.. బట్టలపై, ఇళ్ల గోడలపై కూడా రామ్ రామ్ అని రాసి ఉంటుంది. కానీ రామాలయాలకు వెళ్లరు. రాముడిని పూజించరు. అయితే సృష్టిలోని ప్రతి జీవరాశిలో రాముడు ఉన్నాడని వారి నమ్మకం.

వారు కేవలం రాముడిని తమ దేవుడిగా అనుసరించే హిందూ మత విశ్వాసుల వర్గం. భారతదేశ సమాజం కులం వేళ్లూనుకుపోయింది. దీంతో ఆ తెగ వారు దళితుల కారణంగా వారిని దేవాలయాలలోకి అనుమతించే వారు కాదు. కనీసం ఆలయం బయట నిలబడే హక్కు కూడా వారికి ఉండేది కాదు. మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఇలాంటి ఆచారాలు కొనసాగుతూనే ఉన్నాయి.

1890వ దశకంలో ఛత్తీస్‌గఢ్‌లోని జార్జిగిర్ చంపా అనే ప్రాంతంలో చిన్న గ్రామమైన చర్పరాలో పరశురామ్ అనే దళిత యువకుడు ఉండేవాడు. తమ వర్గాన్ని రాముడి ఆలయంలోకి అనుమతించడంలేదని రామనామి అనే కమ్యూనిటీని స్థాపించాడు. రాముడు అంటే గుడిలో ఉన్న విగ్రహం కాదు.. ఈ సృష్టిలోని అణువు అణువులో రాముడు ఉన్నాడు అని తమ వర్గానికి చెప్పాడు.

రామునిపై తనకున్న భక్తిని చాటుకునేందుకు ఒళ్లంతా రామరామ అని పచ్చబొట్టు వేయించుకున్నాడు. తన శరీరంలోని ప్రతి కణం రాముని నివాసం అని, కాబట్టి తన శరీరమే దేవాలయం అని నమ్మాడు. అప్పటి నుంచి ఈ వర్గానికి చెందిన వారంతా రామరామ అని పచ్చబొట్లు వేయించుకోవడం మొదలైంది.

ఈ తెగ వారంతా అహింసాపరులు, అబద్ధం చెప్పరు. మాంసం ముట్టరు, చెడు అలవాట్లు ఏమీ వుండవు వాళ్లకు. దాదాపు 20 తరాల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. రామ్ నామి సమాజం తమ ఉనికిని కాపాడుకోవడానికి చట్ట పరంగా రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. అధ్యక్షుడు చెప్పిందే అనుసరిస్తారు. కానీ మరో 5, 10 సంవత్సరాల్లో రామ్ నామి సమాజం అంతరించి పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం నేటి తరం అలా ఒళ్లంతా పచ్చబొట్లు వేయించుకోవాడానికి ఇష్టపడడట్లేదు.

చదువుకునే సమయంలో కానీ, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కానీ ఇబ్బందులు తలెత్తుతుండడంతో టాటూ వేయించుకోవడానికి వెనుకాడుతున్నారు. తమ సంప్రదాయాన్ని కొనసాగించడానికి ఎవరూ సుముఖత చూపించడం లేదు. అధికారికంగా, మొదటి పచ్చబొట్టు నుదిటి మధ్యలో చేయించుకుంటారు. కానీ ఇప్పుడు చాలా మంది బయటి ప్రపంచంలో ఎక్కువ సమయం గడుపుతున్నందున శరీరంలోని మరొక భాగంలో ఆ పచ్చబొట్టును వేయించుకుంటున్నారు.

రామనామి పచ్చబొట్టు వేయించుకున్న వ్యక్తి యొక్క లింగాన్ని గుర్తించలేరు. ఒక పురుషుడు లేదా స్త్రీ తమకు నచ్చినన్ని టాటూలు వేయించుకోవచ్చు. చాలామంది అది రాముని పట్ల తమకున్న భక్తిగా భావిస్తారు. పాత తరంవారు రామనామి సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. మారుతున్న సమాజంతో నక్సిఖ్ (పూర్తి శరీర పచ్చబొట్లు) సంఖ్య తగ్గుతోంది. రామ నామి తెగలోని యువ తరం దేవుడి పట్ల తమ అంకితభావాన్ని ఈ విధంగా కొనసాగించాలనుకోవడం లేదు.

Tags

Read MoreRead Less
Next Story