Gujarat : మూడు ఫీట్ల డాక్టర్.. గుజరాత్ లో ఎంత పోరాటం చేశాడో తెలుసా

Gujarat : మూడు ఫీట్ల డాక్టర్.. గుజరాత్ లో ఎంత పోరాటం చేశాడో తెలుసా

కొంతమంది ఎంతో ఘనత సాధిస్తారు. వాళ్లు ఆజానుబాహులై ఉండక్కర్లేదు. తెలివితోనే పని. గుజరాత్​కు (Gujarat) చెందిన గణేశ్ బరైయా (Ganesh Baraiya) వయసు 23ఏళ్లు. ఎత్తు 3 అడుగులు మాత్రమే. అయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. 2018లో ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్ష నీట్ లో 233 మార్కులు సాధించారు. అయితే ఎత్తును కారణంగా చూపించి.. మెడికల్ కాలేజీలో గణేశ్ బరైయాకు సీటు ఇచ్చేందుకు గుజరాత్ ప్రభుత్వం నిరాకరించింది. అయినా కుంగిపోకుండా ఆయన దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈక్రమంలో గణేశ్ బరైయాకు కాలేజీ ప్రిన్సిపల్ దల్పత్ కటారియా సాయం అందించారాయన.

గణేశ్ బరైయా.. సుప్రీం స్థాయిలో ఫైట్ చేశారు. నీట్‌లో మంచి మార్కులు వచ్చినప్పటికీ.. ఎత్తును సాకుగా చూపించి తనకు మెడికల్ కాలేజీలో అడ్మిషన్ కల్పించ కపోవడాన్ని సవాల్ చేస్తూ గణేశ్ బరైయా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. అవసరమైన ఆర్థిక సాయాన్ని కాలేజీ ప్రిన్సిపల్ కటారియా గణేశ్ అందించారు. స్పందించిన సుప్రీంకోర్టు పిటిషన్‌ను విచారించింది. గణేశ్​కు మెడికల్ కాలేజీలో ప్రవేశం కల్పించాలని.. దివ్యాంగుల హక్కుల చట్టాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. దీంతో గుజరాత్‌లోని భావ్​నగర్ వైద్య కళాశాలలో గణేశ్ బరైయాకు ఎంబీబీఎస్ కోర్సులో అడ్మిషన్ లభించింది.

ప్రపంచంలోనే అత్యంత పొట్టి డాక్టర్​ అనే టైటిల్​ ను గణేశ్ బరైయా కే దక్కుతుందని భావ్​నగర్ మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ హేమంత్ మెహతా తెలిపారు. ప్రస్తుతం గణేశ్ మెడికల్ ఇంటర్న్​షిప్‌లో భాగంగా భావ్​నగర్​ వైద్య కళాశాలలో రోగుల వద్దకు వెళ్లి వైద్యం చేస్తున్నారు. తాను డెర్మటాలజిస్టు కావాలని అనుకుంటున్నానని గణేశ్​ అంటున్నారు. భావ్​నగర్ జిల్లా గోరఖి గ్రామానికి చెందిన గణేశ్ బరైయా బరువు 18 కేజీలు. 72శాతం లోకోమోటివ్ వైకల్యంతో బాధపడతున్నారు. గణేశ్​కు 8మంది తోబుట్టువులు ఉన్నారు. అందరూ బానే ఉంటారు. తనకే ఎందుకు ఇలా అని గణేశ్ ఏనాడూ కుంగిపోకుండా చదువుపై దృష్టి పెట్టి ఇప్పుడు వరల్డ్ షార్టెస్ట్ డాక్టర్ ఘనత సాధించడం మామూలు విషయం కాదు.

Tags

Read MoreRead Less
Next Story