Electoral Bonds : ఎలక్టోరల్ బాండ్ల అంటే ఏమిటి? ఎలా కొనుగోలు చేయాలి?

Electoral Bonds : ఎలక్టోరల్ బాండ్ల అంటే ఏమిటి? ఎలా కొనుగోలు చేయాలి?

రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఫైనాన్షియల్ ఇన్ స్ట్రుమెంట్.. సింపుల్ గా చెప్పాలంటే ఓ ప్రామిసరీ నోటు లాంటిది. ఈ బాండ్లను రాజకీయ పార్టీలు జారీచేస్తాయి. రూ. వెయ్యి, రూ.పదివేలు, రూ.లక్ష, రూ.పది లక్షలు, రూ. కోటి చొప్పున బాండ్ల డినామినేషన్ ఉంటుంది. ఈ బాండ్ పై కొనే వారి పేరు కానీ, అమ్మే వారి పేరు కానీ ఉండదు. బాండ్ పేపర్ ఎవరి దగ్గర ఉంటే వారే దానికి యజమాని. ఎస్బీఐ ద్వారా పార్టీలు వీటిని జారీ చేస్తాయి. కొనుగోలు పూర్తయిన 15 రోజుల్లోగా పార్టీలు వీటిని నగదుగా మార్చుకోవాలి. ఆ గడువు దాటితే సదరు బాండ్లను పీఎం రిలీఫ్ ఫండ్ కు జమ చేస్తారు. భారతీయ పౌరులు, కంపెనీలు, సంస్థలు.. మన దేశానికి చెందిన ఎవరైనా, ఎన్నైనా కొనుగోలు చేయవచ్చు. కొనుగోలు చేయడానికి ఎలాంటి పరిమితి విధించలేదు. ప్రారంభంలో ఏడాదిలో 70 రోజులు మాత్రమే వీటిని జారీ చేయడానికి అవకాశం కల్పించగా.. తర్వాత ఈ గడువును కేంద్రం పెంచింది.బాండ్ల జారీ వల్ల సమస్యలేంటి..బాండ్లను ఎవరు కొనుగోలు చేస్తున్నారనే వివరాలు తెలియదు.. పార్టీలకు వస్తున్న విరాళాలు ఎవరు ఇస్తున్నారనే వివరాలు గోప్యంగా ఉంటాయి. ఇది ప్రాథమిక హక్కులకు విరుద్ధమని, క్విడ్ ప్రో కో కు దారితీయొచ్చని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాజకీయ పార్టీలకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే వివరాలు ఈ విధానం వల్ల ప్రజలకు తెలియదని, ఆర్టీఐ ద్వారా కూడా తెలుసుకోవడం వీలు కాదని ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. నిధుల సేకరణలో పారదర్శకత లోపిస్తుందని చెప్పారు.

ఎన్నికల బాండ్ల విలువ 16 వేల కోట్లు

ఎన్నికల బాండ్ల స్కీం మొదలైన 2018 నుంచి ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు అన్ని కలిసి మొత్తం రూ.16, 518.11 కోట్లు సేకరించినట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ వెల్లడించింది. ఇలా బాండ్ల అమ్మకం ద్వారా అత్యధికంగా బీజేపీ రూ.10,122 కోట్లు సేకరించింది. ఇది మొత్తం ఎన్నికల బాండ్ల స్కీం ద్వారా సేకరించిన నిధుల్లో దాదాపు 63 శాతం. ఎలక్ట్రోరల్ బాండ్ల అమ్మకాల లిస్ట్లు ఉన్న మిగతా పార్టీలకు అందిన మొత్తం పోల్చితే ఇది దాదాపు రెండున్నర రెట్లు కావడం గమనార్హం. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఈ స్కీం ద్వారా మొత్తం రూ. 1547 కోట్లు స్వీకరించింది. ఇది మొత్తం విలువలో 10 శాతం కంటే తక్కువ. ఆ తర్వాతి స్థానంలో రూ. 823 కోట్లతో బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), అలాగే సీపీఎం రూ.360 కోట్లు, ఎన్సీపీ రూ.231 కోట్లు, బీఎస్పీ రూ.85 కోట్ల సీపీఐ రూ.13 కోట్లు ఈ రూపంలో సేకరించాయి.

Tags

Read MoreRead Less
Next Story