Vande Bharat : విశాఖకు మరో వందేభారత్

Vande Bharat : విశాఖకు మరో వందేభారత్

Vande Bharat : విశాఖ వాసులకు మరో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. తూర్పు కోస్తా రైల్వే జోన్లోని భువనేశ్వర్ లేదా ఖుర్దా రోడ్ నుంచి విశాఖ వరకు నడపనున్నారు. ఇప్పటికే ట్రైల్ రన్ పూర్తి అయింది. ఉదయం 5.15 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరిన ఈ రైలు 11 గంటలకు విశాఖ చేరుకొంది. మధ్యాహ్నం 3.45 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి 9.30గంటలకు భువనేశ్వర్‌ చేరుకుంది. ఈ రైలుకు 8 బోగీలు ఉంటాయి.

443 కిలోమీటర్ల దూరాన్ని 4.45 గంటల్లో చేరుకుంటుంది. ఖుర్ధారోడ్‌, బ్రహ్మపుర, ఇచ్చాపురం, పలాస, శ్రీకాకుళం రోడ్‌, విజయనగరం స్టేషన్లలో హాల్ట్‌ కల్పించారు. ఈ నెల 12న ప్రధాని నరేంద్ర మోదీని దీనిని వర్చువల్ గా ప్రారంభించనున్నారు. కాగా దీని టైం, ఏయే స్టేషన్ల మధ్య ఆగుతుందనే వివరాలపై స్పష్టత లేదు. విశాఖ-సికింద్రాబాద్‌ మధ్య నడుస్తున్న వందేభారత్‌ రైలులో ఉండే ఛార్జీలే దీనికి వర్తింపచేస్తారని వాల్తేరు రైల్వే అధికారులు చెప్పారు. ఈ వందేభారత్ నలుపు -ఆరెంజ్ రంగులో ఉండనుంది.

Tags

Read MoreRead Less
Next Story