Water Crisis in Bengaluru : బెంగళూరులో నీళ్లు కరువు.. డీకే ఇంటి బోరు కూడా ఎండిపోయింది

Water Crisis in Bengaluru : బెంగళూరులో నీళ్లు కరువు.. డీకే ఇంటి బోరు కూడా ఎండిపోయింది

పొరుగు రాష్ట్రం కర్ణాటకలో (Karnataka) నీటి కరువు తీవ్రంగా ఉంది. బెంగళూరుకు (Bengaluru) అవసరమైనంత నీటి సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ (DK Shivakumar). బెంగళూరులోని అన్ని ప్రాంతాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయని, తన ఇంటి వద్ద ఉన్న బోరుబావి కూడా ఎండిపోయిందన్నారు. తాము గతంలో చూడని భయంకరమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామనీ.. బెంగళూరు నగరానికి ఇబ్బంది లేకుండా నీటిని సరఫరా చేస్తామని డీకే చెప్పడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

కర్ణాటకలో గత సీజన్ లో వర్షాలు లేవు. చాలా ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ దిగిపోయింది. బోరుబావులు ఎండిపోవడంతో బెంగళూరు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. రోజువారీ నీటి వినియోగం పట్ల నివాసితులు జాగ్రత్తగా ఉండాలని రెసిడెన్షియల్ సొసైటీలు సూచించాయి. ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లు నీటి పంపిణీ కోసం నివాసితుల నుండి విపరీతంగా వసూలు చేస్తున్నాయి. రూ.600ల నుంచి రూ.3వేల వరకు ప్రైవేటు వాటర్ ట్యాంకర్లు వసూలు చేస్తున్నారని.. ట్యాంకర్లు ప్రయాణించే దూరం ఆధారంగా డబ్బులు తీసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు డీకే శివకుమార్.

బెంగుళూరు సిటీలోకి చన్నపట్న, మాగాడి, రామనగర, హోసకోట్ ఇతర పొరుగు పట్టణాల నుండి వాటర్ ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. నిజానికి.. మేకేదాటు రిజర్వాయర్ ప్రాజెక్టు బెంగళూరుకు ప్రాణాధారం అని భావిస్తున్నారు. ఐతే.. దానిని కేంద్రం అడ్డుకుంటోందని కర్ణాటక కాంగ్రెస్ సర్కారు ఆరోపిస్తోంది. పాదయాత్ర చేసి మేకేదాటు ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చినా ఆమోదం తెలపలేదన్నారు డిప్యూటీ సీఎం. తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడైనా ప్రాజెక్టును ఓకే చేయాలని కేంద్రాన్ని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story