Mumbai Indians : ముంబై మరో చెత్త రికార్డ్.. ఇక చాలు పాండ్యా..

Mumbai Indians : ముంబై మరో చెత్త రికార్డ్.. ఇక చాలు పాండ్యా..

ముంబై వరుసగా మూడో మ్యాచులోనూ ఓడిపోయిన సంగతి తెలిసిందే. తొలి 2 మ్యాచులు ఇతర వేదికల్లో జరగ్గా.. నిన్న సొంతగడ్డపైనా సత్తా చాటలేకపోయింది. బ్యాటర్లు విఫలం కావడంతో మూడో ఓటమిని మూటగట్టుకుంది. తొలుత ముంబై 125 రన్స్ చేయగా.. రాజస్థాన్ 4 వికెట్లు కోల్పోయి మరో 27 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. RR యంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్ (54*) తన జట్టుకు విజయాన్ని అందించారు. ముంబై బౌలర్ ఆకాశ్ మద్వాల్ 3 వికెట్లు తీశారు.

అయితే ఈ మ్యాచ్ ఓటమితో ముంబై మరో చెత్త రికార్డ్ మూటగట్టుకుంది. ఈ సీజన్‌లో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంది.

మరో వైపు ఈ ఐపీఎల్ సీజన్‌లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఓడిపోవడంతో హార్దిక్ పాండ్య (Hardik Pandya) కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. కెప్టెన్‌గా వ్యూహాలను అమలు చేయడంతో హార్దిక్ ఘోరంగా ఫెయిల్ అవుతున్నారంటూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. ‘ఇక చాలు హార్దిక్.. రోహిత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేయ్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. లేకుంటే ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేమని అభిప్రాయపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story