IPL 2024 : బెంగళూరు చెత్త ప్రదర్శన.. కోహ్లీ ఫ్యాన్స్‌కు నిరాశ

IPL 2024 : బెంగళూరు చెత్త ప్రదర్శన.. కోహ్లీ ఫ్యాన్స్‌కు నిరాశ

షరామామూలుగానే ఐపీఎల్ లో బెంగళూరు కథ ముగిసింది. ఈసారి కప్పు మనదే అంటూ టోర్నీ ప్రారంభానికి ముందు ఊదరగొట్టడం, ఆ తరవాత ఉత్త చేతులతో ఇంటికి వెళ్లడం బెంగళూరుకు అలవాటైపోయింది. కోహ్లీ, డూప్లెసిస్‌, మాక్స్‌వెల్ లాంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఉన్నా, బెంగళూరుకు ఐపీఎల్ లో మరోసారి చెత్త రికార్డే మూటగట్టుకుంది.

విరాట్ కోహ్లీని కాదని డూప్లెసిస్‌కి కెప్టెన్సీ అప్పగించినా ఐపీఎల్ లో బెంగళూరు జాతకం మారలేదు. 8 మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. కోల్కతాతో మ్యాచ్ లో ఓటమిని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.

టార్గెట్ చేజింగ్ లో కష్టపడుతున్నా.. చాలాసార్లు చివరవరకు పట్టుదల ప్రదర్శించలేదు బెంగళూరు. కోల్కతాతో మ్యాచ్ లో 223 లక్ష్యాన్ని కేవలం ఒక్క పరుగు తేడాతో మిస్సయింది. చాలామ్యాచ్ లు ఓడినా.. కొంతవరకు పెర్ఫామెన్స్ మాత్రం బాగానే ఇచ్చిందని ఫ్యాన్స్ ఊరట చెందుతున్నారు. అలా.. అత్యధిక ఓటములతో ఐపీఎల్ నుంచి నిష్క్రమిస్తున్న తొలి జట్టుగా బెంగళూరు అవతరించింది.

Tags

Read MoreRead Less
Next Story