Cricket : క్రికెట్ బాగా ఆడతారా..! గ్రామాల్లో HCA ఉచిత సమ్మర్ క్యాంప్స్

Cricket : క్రికెట్ బాగా ఆడతారా..! గ్రామాల్లో HCA ఉచిత సమ్మర్ క్యాంప్స్

ఇండియాలో క్రికెట్ అనేది ఓ మతం. సమ్మర్ లో అయితే ఎండను కూడా లెక్కచేయకుండా ఆడతారు. అందుకే.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఓ సమ్మర్ క్యాంప్ రెడీ చేస్తోంది. టాలెంట్ హంట్ మొదలుపెట్టింది.

ఈసారి గ్రామీణ, క్రీడాకారులకు గుడ్ న్యూస్ చెప్పింది హెచ్‌సీఏ. హైదరాబాద్ క్రికెట్ ఆసోసియేషన్ (HCA) గ్రామీణ క్రీడాకారులకు తీపి కబురు అందించింది. అర్థిక పరిస్థితుల కారణంగా కావాల్సిన సౌకర్యాలు, క్రీడా సామగ్రి అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్న టాలెంటెడ్ యువతకు అవకాశాలు కల్పిస్తోంది.

జిల్లాకు 15 లక్షల నిధులిచ్చి, ప్రతి జిల్లాలో 3 క్యాంపులు నిర్వహించనున్నట్లు హైదరాబాద్ క్రికెట్ ఆసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు తెలిపారు. జిల్లాలో కోచ్‌లు, ఫిజియోలు లేకపోయినా.. హెచ్‌సీఏ తరుఫున వారిని కూడా గ్రామలకు పంపుతామని తెలిపారు. పేద కుటుంబాల నుంచి వచ్చి క్రికెట్‌లో టాలెంట్ చూపిస్తున్న ప్లేయర్లకు ఉచిత శిక్షణ కొరకు 25 కేంద్రాల్లో 30 రోజుల పాటు సమ్మర్ క్రికెట్ క్యాంపులు నిర్వహించనుంది.

Tags

Read MoreRead Less
Next Story