IPL 2024 : గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మ చెత్త రికార్డు

IPL 2024 : గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మ చెత్త రికార్డు

ఐపీఎల్‌లో గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మ చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా ఆయన రికార్డులకెక్కారు. ఢిల్లీతో నిన్న జరిగిన మ్యాచ్‌లో మోహిత్ 4 ఓవర్లు వేసి వికెట్ లేకుండా 73 పరుగులు ఇచ్చారు. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లో చెలరేగి ఆడిన పంత్‌ ధాటికి అతను ఏకంగా 31 పరుగులు సమర్పించుకున్నాడు.

ఈ క్రమంలో బాసిల్ థంపి (70) రికార్డును ఆయన తిరగరాశారు. ఐపీఎల్‌-2018 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరపున ఆడిన బసిల్‌ థంపి.. ఆర్సీబీతో మ్యాచ్‌లో తన 4 ఓవర్ల కోటాలో 70 పరుగులిచ్చాడు. వీరి తర్వాత యశ్ దయాల్ (69), రీస్ టాప్లే (68) ఉన్నారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ 4 రన్స్ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. 225 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 220 పరుగులకు పరిమితమైంది.

గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్ 65, మిల్లర్ 55, సాహా 39 రన్స్ చేశారు. ఢిల్లీ బౌలర్లలో రసిక్ 3, కుల్దీప్ 2 వికెట్లు తీయగా, నోకియా, ముకేశ్, అక్షర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ సీజన్‌లో గుజరాత్ కి ఇది ఐదో ఓటమి కాగా, ఢిల్లీకి నాలుగో విజయం.

Tags

Read MoreRead Less
Next Story