Hardik Pandya : ట్రోలర్స్‌కు మళ్లీ దొరికిపోయిన హార్దిక్.. ఇక చెడుగుడే

Hardik Pandya : ట్రోలర్స్‌కు మళ్లీ దొరికిపోయిన హార్దిక్.. ఇక చెడుగుడే

ఈ ఐపీఎల్‌లో ట్రోలింగ్ బారిన పడి కొట్టుమిట్టాడుతున్నాడు హార్దిక్ పాండ్యా (Hardik Pandya). మ్యాచ్ మ్యాచ్ కు హార్దిక్ అడ్డంగా దొరికిపోతున్నాడు. గుజరాత్ తో జరిగిన తొలి మ్యాచ్‌లో చెత్త కెప్టెన్సీతో విమర్శల పాలయ్యాడు.

కెప్టెన్‌గా రోహిత్ శర్మని తప్పించి, పాండ్యాని తీసుకురావడం ముంబై ఫ్యాన్స్‌కు నచ్చలేదు. పైగా.. రోహిత్ కు పదే పదే కమాండ్స్ ఇవ్వడం.. ఫీల్డింగ్ పొజిషన్స్ మార్చడం ఫ్యాన్స్ కు నచ్చలేదు. పాండ్యా చేసిన తప్పులన్నింటినీ భూతద్దంలో చూస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్‌లోనూ హార్దిక్ విమర్శకులకు అడ్డంగా దొరికేశాడు.

తొలుత టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకొన్నాడు పాండ్యా. అక్కడి నుంచే… ముంబై పై హైదరాబాద్ బ్యాటర్ల ఊచకోత మొదలైంది. తొలి స్పెల్ బుమ్రాకు ఇవ్వకపోవడం, తొలి పదకొండు ఓవర్లలో బూమ్రాతో ఒక్క ఓవరే వేయించడం విమర్శల పాలయ్యింది. వరల్డ్ క్లాస్ బౌలర్ ని పెట్టుకొని, తొలి స్పెల్ తాను వేయాలనుకోవడం హార్దిక్ చేస్తున్న తప్పు. గుజరాత్ మ్యాచ్‌లో తప్పుని ఇక్కడ కూడా సరిదిద్దుకోలేదు. తొలి స్పెల్ వేసిన హార్దిక్ ధారాళంగా పరుగులు ఇచ్చి హైదరాబాద్ బ్యాటర్లకు గేట్లు ఎత్తడంలో సహాయపడ్డాడు. చివరి ఓవర్ స్పిన్నర్ కు ఇవ్వడం కూడా హార్దిక్ చేసిన పెద్ద తప్పిదమే. మరోవైపు బ్యాటింగ్ లోనూ హార్దిక్ నిరాశ పరిచాడు. ఓవర్ కు 15 పరుగులు అవసరమైన సమయంలో బ్యాటింగ్ కి వచ్చిన హార్దిక్ రన్ రేట్‌కు తగ్గట్టుగా ఆడలేకపోయాడు. దీంతో మళ్లీ తను ట్రోలింగ్ కి గురవుతున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story