IPL 2024 : హైదరాబాద్ పై బెంగళూరు ప్రతీకారం

IPL 2024 : హైదరాబాద్ పై బెంగళూరు ప్రతీకారం

హైదరాబాద్ సన్ రైజర్స్ ను దెబ్బకు దెబ్బ తీసి పగ తీర్చుకుంది బెంగళూరు రాయల్ చాలెంజర్స్. ఈ ఐపీఎల్ 41వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 35 పరుగుల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన డుప్లెసిస్ సారథ్యంలోని ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఆర్సీబీ బౌలర్లు ఈ మ్యాచ్ లో విధ్వంసం సృష్టించారు. హైదరాబాద్ లో తన 8వ మ్యాచ్ లో ఘోర పరాజయం మూటగట్టుకుంది. అంచనాలకు ఏమాత్రం అందుకోలేదు. పాయింట్స్ టేబుల్ లో హైదరాబాద్ 3, బెంగళూరు 10వస్థానంలో ఉన్నాయి.

207 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు క్రీజులోకి వచ్చిన హైదరాబాద్ కు ఆదిలోనే షాక్ తగిలింది. అభిషేక్ శర్మ, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ మినహా జట్టులోని ఏ బ్యాట్స్‌మెన్ కూడా ఎక్కువ సేపు వికెట్‌పై నిలువలేకపోయారు. ఆర్సీబీ బౌలర్లలో స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, కామెరాన్ గ్రీన్ తలా రెండు వికెట్లు తీశారు. అలాగే విల్ జాక్వెస్, యశ్ దయాల్ కూడా చెరో వికెట్ తీశారు. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి గట్టి ఆరంభం లభించింది. కోహ్లి సీజన్ లో నాలుగో అర్ధశతకం సాధించాడు. హైదరాబాద్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ మూడు వికెట్లు తీశాడు.

Tags

Read MoreRead Less
Next Story