India vs England : నేటి నుంచి ఇండియా, ఇంగ్లండ్ మూడో టెస్ట్

India vs England : నేటి నుంచి ఇండియా, ఇంగ్లండ్ మూడో టెస్ట్

నేటి నుంచి ఇండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య రాజ్ కోట్ వేదికగా మూడో టెస్ట్ జరగనుంది. ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లో చెరోకటి గెలిచి సిరీస్ లో సమానంగా ఉండగా మూడో టెస్టులో గెలిచి అధిక్యత సాధించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి . ఈ మ్యాచ్‌‌ ఇంగ్లండ్ కెప్టెన్‌‌ బెన్ స్టోక్స్‌‌కు వందో టెస్టు కాగా.. టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని అందుకోవడానికి అశ్విన్‌కు మరో ఒక్క వికెట్​ అవసరం.

గాయాలతో సతమతమవుతున్న టీమ్‌ఇండియా మూడో టెస్టుకు కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వనుంది. విరాట్ కోహ్లీ సిరీస్‌‌ మొత్తానికి దూరంగా ఉండగా.. గాయం కారణంగా కేఎల్‌‌ రాహుల్ ఈ మ్యాచ్‌‌లో బరిలోకి దిగడం లేదు. దీంతో సర్ఫరాజ్‌ ఖాన్‌కు తుది జట్టులో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక హార్డ్‌ హిట్టింగ్‌ కీపర్‌-బ్యాటర్‌ ధ్రువ్‌ జురెల్‌ కు చోటు దక్కే అవకాశం లేకపోలేదు.

టీమిండియా లాగే మాదిరిగా ఇంగ్లిష్‌ టీమ్‌లోనూ కొన్ని సమస్యలు ఉన్నాయి. సీనియర్ బ్యాటర్ జో రూట్‌‌ బ్యాటింగ్‌లో కంటే స్పిన్‌‌ బౌలింగ్‌‌తో సత్తా చాటుతున్నాడు. గాయంతో స్పిన్నర్ జాక్‌‌ లీచ్‌‌ దూరం అవ్వడంతో ఇంగ్లిష్ టీమ్ అతనిపై ఆధారపడాల్సి వస్తోంది. అయితే, గత నాలుగు ఇన్నింగ్స్‌‌ల్లోనూ బ్యాట్‌తో ఫెయిలైన రూట్‌‌ ఈసారి మెరుగవ్వాలని జట్టు కోరుకుంటోంది.

రాజ్ కోట్ లో ఇప్పటివరకు రెండు టెస్ట్ మ్యాచ్ లు జరిగాయి. 2016లో ఇదే ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ డ్రా అయ్యింది. 2018లో వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో మాత్రం ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో టీమ్ ఇండియా విజయం సాధించింది.

తుది జట్లు

ఇండియా (అంచనా) : రోహిత్ (కెప్టెన్), యశస్వి గిల్, రజత్, సర్ఫరాజ్, జడేజా, జురెల్/భరత్ (కీపర్), అశ్విన్, అక్షర్​/కుల్దీప్, బుమ్రా, సిరాజ్

ఇంగ్లండ్ : క్రాలీ, డకెట్, ఒలీ పోప్, రూట్, బెయిర్‌‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (కీపర్), రెహాన్, టామ్ హార్ట్‌‌లీ, మార్క్ వుడ్, అండర్సన్.

Tags

Read MoreRead Less
Next Story