IPL 2024 : స్టేడియంలో కొట్టుకున్న ప్రేక్షకులు

IPL 2024 : స్టేడియంలో కొట్టుకున్న ప్రేక్షకులు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్ ) 2024 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) vs ముంబై ఇండియన్స్ (Mumbai Indians) మధ్య ఆదివారం (మార్చి 25) ఐదవ మ్యాచ్ సూర్యాస్తమయం తర్వాత ప్రారంభమైనప్పటికీ, కొంతమంది ప్రేక్షకుల మధ్య నరేంద్ర మోదీ స్టేడియంలోని హింసాత్మక వాతావరణం నెలకొంది.

హార్ధిక్ పాండ్యా (Hardik Pandya) ముంబై ఇండియన్స్ జట్టు పగ్గాలు చేపట్టిన తరువాత తొలి మ్యాచ్ ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ ప్రారంభం నుంచి స్టేడియంలో అభిమానులు రోహిత్ శర్మ నామస్మరణ చేశారు. రోహిత్ ఫీల్డింగ్, బ్యాటింగ్ చేస్తున్నంత సేపు రోహిత్.. రోహిత్ అంటూ అభిమానులు పెద్దెత్తున నినాదాలు చేశారు. అయితే, మ్యాచ్ జరుగుతుండగా స్టేడియంలో ప్రేక్షకుల మధ్య ఘర్షణ జరిగింది. ముగ్గురు నలుగురు వ్యక్తులు కొట్టుకున్నారు. దీంతో స్టేడియంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయితే, కొట్టుకుంది రోహిత్, హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్ అని ప్రచారం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆదివారం రాత్రి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్లు ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబై జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మను యాజమాన్యం తప్పించిన విషయం తెలిసిందే.. రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యా జట్టు పగ్గాలు అందుకున్నాడు. రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై రోహిత్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గత రెండు నెలలుగా పాండ్యా పై రోహిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story