కుంబ్లే రికార్డును సమం చేసిన జడేజా

కుంబ్లే రికార్డును సమం చేసిన జడేజా

టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే (Anil Kumble) రికార్డును సమం చేశాడు జడేజా (Jadeja). భారత్ (India) లో జరిగిన అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న భారత క్రికెటర్ గా జడేజా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు అనిల్ కుంబ్లే ఉండగా.. దానిని జడేజా సమం చేశాడు. వీరిద్దరు తొమ్మిదేసి సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నారు.

అనిల్ కుంబ్లే 63 టెస్టుల్లో ఈ ఘనత సాధించగా.. జడేజా 42 టెస్టుల్లోనే సాధించాడు. ఇక వీరి తరువాత ఈ లిస్టులో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఇక అశ్విన్, హర్భజన్, జవగళ్ శ్రీనాథ్ ఆరుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నారు. మొత్తంగా చూసుకుంటే దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అత్యధికంగా 14 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.

ఇక ఇంగ్లండ్‌తో ముగిసిన మూడో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అదరగొట్టిన రోహిత్ సేన 434 పరుగుల భారీ తేడాతో విజయభేరి మోగించింది. 557 పరుగుల భారీ లక్ష్య చేధనలో టీమిండియా బౌలర్లను ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 122 పరుగులకే కుప్పకూల్చింది. లోకల్ బౌలర్ రవీంద్ర జడేజా 5 వికెట్లతో చెలరేగాడు.

Tags

Read MoreRead Less
Next Story