IPL 2024 : ఐపీఎల్ లోనే బుమ్రా అరుదైన రికార్డ్

IPL 2024 : ఐపీఎల్ లోనే బుమ్రా అరుదైన రికార్డ్

ముంబై ఇండియన్స్ గెలుపు బాట పట్టింది. మరోవైపు.. ప్లేయర్లు కూడా రికార్డులపై కన్నేసారు. గురువారం రాత్రి పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 9 పరుగుల తేడాతో విజయం నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో జస్ ప్రీత్ బుమ్రా తన యార్కర్ లతో పంజాబ్ ఆటగాళ్లను దెబ్బతీశాడు. ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త చరిత్రను సృష్టించాడు.

ఈ టోర్నీ హిస్టరీలోనే ఈ ఘనత సాధించిన తొలి పేస్ బౌలర్ గా వినతికెక్కాడు. ముంబై జుట్టు తరఫున వికెట్లు తీయడంతోపాటు పొదుపుగా బౌలింగ్ వేస్తున్నాడు బుమ్రా. ఆ జట్టు సాధించిన మూడు విజయాలలో తన వంతు పాత్ర పోషించాడు. కీలక మూడు వికెట్లు తీసిన బుమ్రా కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కింది.

ఈ పురస్కారంతో బుమ్రా ఐపీఎల్ లో సరికొత్త అధ్యాయం లిఖించాడు. అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాలు అందుకున్న ఉమేష్ యాదవ్ (10) సరసన చేరాడు. ఇప్పటివరకు ఏడు మ్యాచ్ లు ఆడిన బుమ్రా.. 13 వికెట్లు పడగొట్టాడు. పర్పుల్ క్యాప్ హోల్డర్ గా ముందు వరుసలో ఉన్నాడు.

Tags

Read MoreRead Less
Next Story