Memorable Gift : తెలుగు వారికి మహేంద్రుడి మెమరబుల్ గిఫ్ట్

Memorable Gift : తెలుగు వారికి మహేంద్రుడి మెమరబుల్ గిఫ్ట్
తెలుగు గడ్డ మీదే సత్తా చాటి అంతర్జాతీయ రికార్డులకు నాందిపలికాడు ధోనీ. ధోని తొలి సెంచరీ కొట్టింది విశాఖ తీరంలోనే. పాకిస్థాన్ పై సాధించిన 148 పరుగులు ప్రపంచానికి ధోనిలోని దమ్ముని పరిచయం చేశాయి.

క్రికెట్ లెజెండ్, కోట్లాది మంది ఆరాధ్య క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి (Mahendra Singh Dhoni) తెలుగు రాష్ట్రాలతో మంచి రిలేషన్ ఉంది. తెలుగు గడ్డ మీదే సత్తా చాటి అంతర్జాతీయ రికార్డులకు నాందిపలికాడు ధోనీ. ధోని తొలి సెంచరీ కొట్టింది విశాఖ తీరంలోనే. పాకిస్థాన్ పై సాధించిన 148 పరుగులు ప్రపంచానికి ధోనిలోని దమ్ముని పరిచయం చేశాయి.

తొలిసారి మెరిసిన తెలుగు నేల విశాఖకు మర్చిపోలేని బహుమతి ఇచ్చేశాడు ధోని. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ రెండు మ్యాచుల్లో విజయం సాధించింది. అయితే ఆ జట్టుకి ఆడుతున్న ధోని బ్యాటింగ్ కి రాకపోవడం అభిమానులని నిరాశ పరిచింది. ఢిల్లీ క్యాపిటల్ తో జరిగిన మ్యాచ్ కు విశాఖ వేదికైంది. ఈ మ్యాచ్ లో చెన్నై ఓడిపోయింది. కానీ ధోని ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకున్నారు. కారణం.. బ్యాటింగ్ కి దిగిన ధోనీ దంచేశాడు. కళ్ళు చెదిరిపోయే వింటేజ్ షాట్స్ ఆడాడు. సింగిల్ హ్యాండ్ తో కొట్టిన సిక్స్ హైలైట్ అంటున్నారు ఫ్యాన్స్.

కేవలం 16 బంతులాడిన ధోని నాలుగు ఫోర్లు, మూడు సిక్సులతో చెలరిగిపోయాడు. ఈ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ధోని ఫ్యాన్స్ లో నిరాశ లేదంటే ఆ క్లాసిక్ షాట్స్ కు మైమరిచిపోయారని చెప్పుకోవచ్చు. ధోనీకి చివరి సీజన్ అంటూ ప్రచారం జరుగుతున్న ఈ టైంలో.. ఆ మెమరబుల్ షాట్స్ కళ్లారా చూసిన ఆనందం ఫ్యాన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోతుందనడంలో సందేహం లేదు.

Tags

Read MoreRead Less
Next Story