IPL 2024 : చెన్నైకి దిమ్మతిరిగేలా చేసిన స్టోనిస్.. ఇదేం కొట్టుడురా అయ్యా..!

IPL 2024 : చెన్నైకి దిమ్మతిరిగేలా చేసిన స్టోనిస్.. ఇదేం కొట్టుడురా అయ్యా..!

ఐపీఎల్ 2024లో మెరుపు ఇన్నింగ్స్ లకు కొదువే లేదు. సూపర్ నాక్స్ ఇష్టపడే అభిమానులకు లైవ్ లోనే హైలైట్స్ చూపిస్తున్నారు దమ్మున్న బ్యాటింగ్ మొనగాళ్లు. ప్రత్యర్థి ఎంత బలవంతుండైనా తమ బౌండరీల హోరుతో ఓడించేస్తున్నారు. అలా.. చెన్నైపై క్లాసిక్ ఇన్నింగ్స్ అడాడు లక్నో బ్యాటర్ స్టోనిస్.

ఐపీఎల్ 2024 సీజన్ 39వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో చెన్నైపై లక్నో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్నో కెప్టెన్ రాహుల్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. చెన్నై 210 పరుగులు చేయగా.. లక్నో 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నాలుగు వికెట్లకు 210 పరుగులు చేసింది. సీఎస్‌కే తరఫున రితురాజ్ గైక్వాడ్ 108 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత లక్నో 19.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మార్కస్ స్టోనిస్ 63 బంతుల్లో 124 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ విజయంతో లక్నో జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. చెన్నై ఐదో స్థానానికి పడిపోయింది. చెన్నై నెక్స్ట్ మ్యాచ్ ఏప్రిల్ 28న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడాల్సి ఉండగా.. లక్నో జట్టు ఏప్రిల్ 27న రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది. ఈ రెండు టఫ్ ఫైట్లేనని క్రీడా విశ్లేషకుల అంచనా.

Tags

Read MoreRead Less
Next Story