Aus vs NZ : అశ్విన్ రికార్డ్ బ్రేక్ చేసిన నాథన్ లియోన్

Aus vs NZ : అశ్విన్ రికార్డ్ బ్రేక్ చేసిన నాథన్ లియోన్

Aus vs NZ : వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో 172 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. . దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ (Nathon Lyon).. ఓవరాల్ గా రెండు ఇన్నింగ్స్ లు కలిపి 10 వికెట్లను సాధించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్స్ పడగొట్టిన లియోన్.. రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసి కివీస్‌ పతనాన్ని శాసించాడు.

దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ చరిత్రలోనే అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనతను అందు కున్న తొలి బౌలర్ గా నిలిచాడు. డబ్ల్యూటీ సీలో ఇప్పటివరకు 10 సార్లు 5 వికెట్ల హాల్ సాధించాడు నాథన్ లియోన్. కాగా ఈ రికార్డు భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉండేది. అశ్విన్ 9 సార్లు ఈ ఫీట్ సాధించాడు. తాజా మ్యాచ్ తో అశ్విన్ రికార్డు ను లియోన్ బ్రేక్ చేశాడు.

Tags

Read MoreRead Less
Next Story