Ind vs Eng : రోహిత్ కు బ్రేక్.. కెప్టెన్‌గా అశ్విన్‌..!

Ind vs Eng : రోహిత్ కు బ్రేక్..  కెప్టెన్‌గా అశ్విన్‌..!

మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా టీమిండియా (India), ఇంగ్లండ్‌ జట్ల (England) మధ్య ఐదో టెస్టు జరగనుంది. ఇది టీమిండియా వెటరన్‌ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin) కు తన కెరీర్‌లో వందో టెస్టు కావడం విశేషం. ఇప్పటివరకు భారత్ తరుపున వంద టెస్టు మ్యాచ్ లు ఆడిన 14వ భారత ఆటగాడిగా అశ్విన్‌ నిలువనున్నాడు.

ధర్మశాలలో జరిగే ఈ టెస్టు మ్యాచ్ కు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 31తో టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకోవడంతో మేనెజ్‌మెంట్‌ రోహిత్ కు రెస్ట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. రోహిత్ కు రెస్ట్ ఇస్తే భారత జట్టు పగ్గాలను అశ్విన్‌కు అప్పగించే ఛాన్స్‌ ఉంది.

100 టెస్టు ఆడనున్న అశ్విన్‌కు గౌరవార్థం మెనెజ్‌మెంట్‌ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వందో టెస్టు ఆడనున్న అశ్విన్‌కు గౌరవార్థం మెనెజ్‌మెంట్‌ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్ సైతం అశ్విన్‌కు 100 టెస్టులో జట్టు పగ్గాలను అప్పజెప్పాలని అభిప్రాయపడ్డాడు. కాగా తన టెస్టు కెరీర్‌లో 99 టెస్టులు ఆడిన అశ్విన్‌ 507 వికెట్లతో పాటు 3309 పరుగులు చేశాడు.

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్యూలర్ 200 టెస్టులు ఆడిన విషయం తెలిసిందే. రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్షణ్, అనిల్ కుంబ్లే, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హర్భజన్ సింగ్, వీరేందర్ సెహ్వాగ్, చటేశ్వర్ పుజారా లాంటి వారు 100కు పైగా టెస్టులు ఆడారు.

Tags

Read MoreRead Less
Next Story