Ashwin's Record : వందో టెస్టులో అశ్విన్ చెత్త రికార్డు

Ashwins Record : వందో టెస్టులో అశ్విన్ చెత్త రికార్డు

తన వందో టెస్ట్ మ్యాచ్ లో టీమ్ ఇండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. ఈ మ్యాచ్ లో డకౌట్ అయి నిరాశపరిచారు. దీంతో వందో టెస్టులో డకౌటైన మూడో భారత క్రికెటర్, ఓవరాల్ గా తొమ్మిదో ప్లేయర్ గా అప్రతిష్ఠ మూటగట్టుకున్నారు. కాగా వందో టెస్టులో డకౌటైన తొలి భారత ఆటగాడిగా దిలీప్ వెంగ్సర్కార్ (1988) రికార్డులకెక్కారు. ఆ తర్వాత పుజారా (2023) కూడా తన వందో టెస్టులో డకౌటయ్యారు.

ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా 500 పరుగుల దిశగా దూసుకెళ్తోంది. రెండో రోజు ఆట ముగిసేసమయానికి 8 వికెట్లు కోల్పోయి 478 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(103), శుభ్ మాన్ గిల్(110) సెంచరీలు బాదగా.. దేవదత్ పడిక్కల్(65), సర్ఫరాజ్ ఖాన్(56) హాఫ్ సెంచరీలతో మెరిశారు.

Tags

Read MoreRead Less
Next Story