IPL 2024 : ట్రోల్ చేయొద్దు.. ఓడిపోయిన మ్యాచ్‌లోనూ ఆర్సీబీ సంచలన రికార్డ్

IPL 2024 : ట్రోల్ చేయొద్దు.. ఓడిపోయిన మ్యాచ్‌లోనూ ఆర్సీబీ సంచలన రికార్డ్

ఈ ఏడాది ఐపీఎల్ దుమ్ములేపుతోంది. మునుపెన్నడూ లేనంత జోష్ తో సీజన్ సాగిపోతోంది. సన్ రైజర్స్ మ్యాచ్ వచ్చిందంటే స్మార్ట్ ఫోన్, టీవీలకు అతుక్కుపోతున్నారు జనాలు. ఐపీఎల్ 2024 లో భాగంగా సోమవారం ఆర్సీబీ, సన్ రైజర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచులో అనేక రికార్డులు బద్దలయ్యాయి.

మొదట బ్యాటింగ్ చేసిన ఆరెంజ్ ఆర్మీ 20 ఓవర్లకు 287 పరుగులతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు నమోదు చేశారు. ఈ సీజన్ లో తానే క్రియేట్ చేసిన రికార్డ్ ను మళ్లీ తిరగరాసింది. 288 టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్సీబీ బ్యాట్స్ మన్ కూడా జనంతో చప్పట్లు కొట్టేలా ప్రదర్శన చేశారు.

హైదరాబాద్ బౌలర్లపై తమ ప్రతాపాన్ని చూపించారు రాయల్ చాలెంజర్స్ బ్యాటర్లు. దినేష్ కార్తీక్ సంచలన ఇన్నింగ్స్, భారీ షాట్లతో బెంగళూరు గెలుస్తుందా అన్న అంచనాలు కూడా ఏర్పడ్డాయి. ఐతే.. డీకే అవుట్ కావడంతో 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఎక్కువ పరుగులు ఇచ్చిన జట్టుగా చెత్త రికార్డ్ తో పాటు... టార్గెట్ చేజింగ్ లో 250 కంటే ఎక్కువ స్కోర్ చేసిన ఏకైక జట్టుగా ఆర్సీబీ నిలిచింది.

Tags

Read MoreRead Less
Next Story