Cricket Records : పరుగులేమీ ఇవ్వకుండా ఏడు వికెట్లు.. అరుదైన రికార్డ్

Cricket Records : పరుగులేమీ ఇవ్వకుండా ఏడు వికెట్లు.. అరుదైన రికార్డ్

టీట్వంటీలో ముందెన్నడూ వినని ఓ రికార్డ్ క్రియేట్ అయింది. ఇండోనేషియా బౌలర్ రొహ్మాలియా టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. 17 ఏళ్ల రోహ్మాలియా 3.2 ఓవర్లలో పరుగులు ఇవ్వకుండా 7 వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతకుముందు 2021లో జరిగిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌పై నెదర్లాండ్స్‌కు చెందిన ఫ్రెడరిక్ ఓవర్‌డిజ్క్ 4-2-3-7 వికెట్లు పడగొట్టిన బెస్ట్ రికార్డ్ ను రొహ్మాలియా బ్రేక్ చేసింది.

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చివరి T20Iలో మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డ్ సాధించింది రొహ్మాలియా. తన అసాధారణ ప్రదర్శనతో 3.2-3-0-7తో చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 7 వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా నిలిచింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఇండోనేషియా 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఇండోనేషియా మంగోలియాను 16.2 ఓవర్లలో 24 పరుగులకు ఆలౌట్ చేసి 127 పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది.

Tags

Read MoreRead Less
Next Story