సానియాతో కలిసుండే సమయం దొరకట్లేదు: షోయబ్ మాలిక్

సానియాతో కలిసుండే సమయం దొరకట్లేదు: షోయబ్ మాలిక్
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో విడాకుల రూమర్స్‌ను ఖండించారు పాక్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్. “బిజీ షెడ్యూల్” కారణంగానే కలిసి కనిపించట్లేదని అన్నారు.

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో విడాకుల రూమర్స్‌ను ఖండించారు పాక్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్. “బిజీ షెడ్యూల్” కారణంగానే కలిసి కనిపించట్లేదని అన్నారు. గత ఆరు నెలలుగా కలిసి కనిపించకపోవడంతో మాలిక్, సానియాలు విడిపోతున్నారనే వదంతులు వ్యాపించాయి. 2010లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఒక కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో ప్రత్యేక ఈద్ షోలో పాల్గొన్న మాలిక్, సోనియా నేను కలిసే ఉన్నామని, విడిపోలేదని చెప్పారు.

“నా భార్య, కొడుకు ఈద్‌కి దూరంగా ఉన్నారు. వారిద్దరితో కలిసి ఈద్ జరుపుకోవాలనుకుంటున్నాను”అని చెప్పాడు. ప్రతి వివాహ బంధంలో కొన్ని సమస్యలు ఉంటాయి. వాటన్నిటికే కాలమే పరిష్కారం చెబుతుంది. అన్ని వివాహాలు ఒడిదుడుకులతో సాగుతాయని సీనియర్ క్రికెటర్ అంగీకరించాడు. అయితే దీని అర్థం సంబంధం ముగిసిందని కాదు అని మాలిక్ అన్నారు. తమకు ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగానే కొంత కాలం నుంచి విడిగా ఉంటున్నామని, కలుసుకోవడానికి వీలుపడట్లేదని అన్నారు. మున్ముందు మంచి రోజులు ఉన్నాయని భావిస్తున్నట్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story