Most Sixers : అత్యధిక సిక్సులు.. ఆర్సీబీ రికార్డు బద్దలు

Most Sixers : అత్యధిక సిక్సులు.. ఆర్సీబీ రికార్డు బద్దలు

చినస్వామి స్టేడియంలో ఆర్సీబీ, సన్‌రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అత్యధిక సిక్సులు నమోదయ్యాయి. సన్‌రైజర్స్ ప్లేయర్లు 22 సిక్సర్లు బాదగా.. ఐపీఎల్ హిస్టరీలో ఒక ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధికం. ఇప్పటి వరకు ఈ రికార్డు ఆర్సీబీ పేరున (2016లో పుణే వారియర్స్‌పై 21 సిక్సులు) ఉండగా.. ఇప్పుడు సన్‌రైజర్స్ అధిగమించింది. కాగా ఇదే మ్యాచ్‌లో ఆర్సీబీపై 287 పరుగులు చేసిన సన్‌రైజర్స్ గత రికార్డులను బద్దలు కొట్టింది.

ఇక మరోవైపు సన్‌రైజర్స్ తో మ్యాచులో ఆర్సీబీ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న, అత్యల్ప స్కోర్ చేసిన టీంగా నిలిచింది. సన్‌రైజర్స్ 287 రన్స్ చేయగా, ఇదే అత్యధిక స్కోర్. ఇక 2017లో కోల్ కత్తాపై ఆర్సీబీ 49 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్ హిస్టరీలో అత్యల్ప స్కోర్ ఇదే. దీంతో రెండు చెత్త రికార్డులు ఆర్సీబీ పేరుపై నమోదయ్యాయి.

ఆర్సీబీని సొంతగడ్డపైనే సన్‌రైజర్స్ ఓడించింది. తొలుత సన్‌రైజర్స్ 287 పరుగులు చేయగా.. బెంగళూరు 262 పరుగులు చేసింది. దీంతో హైదరాబాద్ 25 రన్స్ తేడాతో గెలిచింది. వెటరన్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ వీర విహారం చేశారు. 35 బంతుల్లో 83 పరుగుల (7 సిక్సర్లు, 5 ఫోర్లు)తో ఒంటరి పోరాటం చేశారు. కోహ్లీ 42(20), డుప్లెసిస్ 62(28) రాణించారు. కమిన్స్ 3 వికెట్లు, మార్కాండే 2 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

Tags

Read MoreRead Less
Next Story