SRH vs RCB : వారెవ్వా.. ఇది పైసా వసూల్ మ్యాచ్

SRH vs RCB : వారెవ్వా.. ఇది పైసా వసూల్ మ్యాచ్

హోరాహోరీ క్రికెట్ మ్యాచ్ ఇచ్చే కిక్కే వేరు. హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్‌లో ఫోర్లు, సిక్సర్లతో ఇరుజట్ల ప్లేయర్లు తగ్గేదేలే అన్నట్లు విరుచుకుపడ్డారు. దీంతో ఫ్యాన్స్ పైసా వసూల్ పర్ఫార్మెన్‌ను ఎంజాయ్ చేశారు.హైదరాబాద్ లో హెడ్(102), క్లాసెన్(67), సమద్(37), అభిషేక్‌(34), మార్క్రమ్(32) బ్యాటుతో సత్తా చాటగా.. కమిన్స్(3), మార్కండే(2) బంతితో రాణించారు. ఆర్సీబీలో దినేష్ కార్తీక్ (83), డుప్లెసిస్(62), కోహ్లీ(42) దీటుగా బదులిచ్చే ప్రయత్నం చేశారు.

ఆర్సీబీని సొంతగడ్డపైనే హైదరాబాద్ ఓడించింది. తొలుత హైదరాబాద్ 287 పరుగులు చేయగా.. బెంగళూరు 262 పరుగులు చేసింది. దీంతో హైదరాబాద్ 25 రన్స్ తేడాతో గెలిచింది. వెటరన్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ వీర విహారం చేశారు. 35 బంతుల్లో 83 పరుగుల (7 సిక్సర్లు, 5 ఫోర్లు)తో ఒంటరి పోరాటం చేశారు. కోహ్లీ 42(20), డుప్లెసిస్ 62(28) రాణించారు. కమిన్స్ 3 వికెట్లు, మార్కాండే 2 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

మరోవైపు సీజన్లు మారినా, ప్లేయర్లు మారినా ఆర్సీబీ తలరాత మారట్లేదు. ఈ సాల కప్ నమ్దే అంటూ ఉత్సాహపరిచే అభిమానులను ప్లేయర్లు నిరాశపరుస్తూనే ఉన్నారు. వేలంలో మంచి ఆటగాళ్లను సెలెక్ట్ చేసుకోకపోవడం, బెస్ట్ ప్లేయర్లను వదిలేసుకోవడమే టీం వైఫల్యాలకు కారణమని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇతర జట్లలో ఉన్నప్పుడు చక్కగా ఆడే ప్లేయర్లు సైతం ఆర్సీబీకి రాగానే తేలిపోతున్నారు. ఇదేం కర్మో మరి..

Tags

Read MoreRead Less
Next Story