IPL : రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ

IPL : రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ

సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో రికార్డు సృష్టించారు. ఐపీఎల్ చరిత్రలో 10 సీజన్లలో 400కు పైగా రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచారు. కోహ్లీ.. 2011(557 రన్స్), 2013(634), 2015(505), 2016(973), 2018(530), 2019(464), 2020(466), 2021(405), 2023(639) సీజన్లతో పాటు 2024లోనూ ఈ ఫీట్ సాధించారు. ఓపెనర్‌గానూ 4000 పరుగుల మైలురాయి అందుకున్నారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఉప్పల్ వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ 35 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. 207 పరుగుల లక్ష్యంగా దిగిన సన్‌రైజర్స్ 171 పరుగులకే పరిమితమైంది. సన్ రైజర్స్ బ్యాటర్లలో షాబాజ్(40*), అభిషేక్(31), కమిన్స్(31) ఫర్వాలేదనిపించారు. ఆర్సీబీ బౌలర్లలో స్వప్నిల్, కరణ్ శర్మ, గ్రీన్ తలో 2 వికెట్లు, యశ్ దయల్, విల్ జాక్స్ చెరొక వికెట్ తీశారు. కాగా ఇది ఆర్సీబీకి రెండో విజయం.

దీంతో వరుస ఓటములకు ఆర్సీబీ బ్రేక్ వేసింది. ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. మార్చి 22న చెన్నైపై ఓడిన ఆర్సీబీ.. అదే నెల 25న పంజాబ్ కింగ్స్‌పై తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచ్‌లలో(KKR, LSG, RR, MI, SRH, KKR) ఓడి ప్లేఆఫ్స్ అవకాశాన్ని దాదాపు కోల్పోయింది. తొలి గెలుపు దక్కిన నెల రోజుల తర్వాత ఏప్రిల్ 25న రెండో మ్యాచ్ గెలిచింది. మిగతా 5 మ్యాచ్‌లలోనూ గెలిచి సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story