Yasashwi Jaiswal : కెరీర్ బెస్ట్ ర్యాంక్ లో జైస్వాల్

Yasashwi Jaiswal : కెరీర్ బెస్ట్ ర్యాంక్ లో జైస్వాల్

ఇంగ్లండ్ (England) తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashaswi Jaiswal) ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో (ICC Test Rankings) కెరీర్ బెస్ట్ ర్యాంక్ను సొంతం చేసుకున్నాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన తాజా టెస్టు ర్యాంకింగ్స్ లో జైస్వాల్ ఏకంగా 14 స్థానాలు ఎగబాకి కెరీర్ అత్యుత్తమమైన 15వ ర్యాంకు చేరాడు. కాగా ఈ సిరీస్లో జైస్వాల్ అద్భుతంగా రాణిస్తూ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్టులో 80 పరుగులు చేసిన జైస్వాల్ ఆ తర్వాత విశాఖ (రెండో టెస్టు), రాజ్కోట్ (మూడో టెస్టు)లో వరుసగా రెండు ద్విశతకాలతో చెలరేగాడు. కాగా రాజ్ కోట్ టెస్టుకు ముందు 29వ ర్యాంక్లో ఉన్న ఈ యువ ఓపెనర్ యశస్వి ఇప్పుడు తాజా ర్యాంకింగ్స్లో 699 పాయింట్లతో 15వ స్థానాన్ని దక్కించుకున్నాడు. కాగా, టీమిండియా తరఫున టెస్టు బ్యాటింగ్స్ విరాట్ కోహ్లి ఒక్కడే టాప్-10లో నిలిచాడు. వ్యక్తిగత కారణాలతో ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్ నుంచి తప్పుకున్న కోహ్లి తాజా ర్యాంకింగ్స్ లో (752) రేటింగ్ పాయింట్లతో 7వ స్థానంలో ఉన్నాడు.

మరోవైపు టీమిండియా సారథి రోహిత్ శర్మ ఒక స్థానం ఎగబాకి 12వ ర్యాంక్ కు చేరాడు. రాజ్ కోట్ టెస్ట్ లో బ్యాటింగ్, బౌలింగ్ లో సత్తా చాటిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రెండు విభాగాల ర్యాంకింగ్స్ లో ముందంజ వేశాడు. జడేజా బ్యాటింగ్ లో 7 స్థానాలు ఎగబాకి 34వ ర్యాంకు దక్కించుకున్నాడు. బౌలింగ్ లో టీమిండియా ప్రధాన పేసర్ జస్రీత్ బుమ్రా తన నెంబర్-1 ర్యాంక్ను పదిలంగా ఉంచుకున్నాడు. 876 పాయింట్లతో బుమ్రా అగ్ర స్థానంలో నిలివగా.. రవిచంద్రన్ అశ్విన్ 839తో రెండో స్థానంలో ఉన్నాడు. మరోవైపు రాజ్కోట్ టెస్ట్ (2,5) ఏడు వికెట్లతో చెలరేగిన జడేజా 3 స్థానాలు ఎగబాకి 6వ ర్యాంక్ ను సొంతం చేసుకున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story