TS : తెలంగాణ 'గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా' : మోదీ

TS : తెలంగాణ గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా :  మోదీ

తెలంగాణలోని (Telangana) సంగారెడ్డిలో (Sangareddy) ఈరోజు (మార్చి 5) రూ. 7,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, అంకితం చేసి, శంకుస్థాపన చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ ప్రాజెక్టులు రోడ్డు, రైలు, పెట్రోలియం, సహజ వాయువు వంటి బహుళ కీలక రంగాల ప్రాధాన్యతను నొక్కి చెబుతున్నాయి.

సంగారెడ్డిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తెలంగాణను దక్షిణ భారతదేశానికి గేట్‌వేగా పిలుస్తారని అన్నారు. “తెలంగాణలో రైల్వే సౌకర్యాలను మెరుగుపరచడానికి, విద్యుదీకరణ ప్రక్రియ కూడా జరుగుతోంది” అన్నారాయన.

తెలంగాణ ప్రగతికి తన నిబద్ధతను పునరుద్ఘాటించిన ప్రధాన మంత్రి, రాష్ట్రాల అభివృద్ధే దేశాభివృద్ధి అనే స్ఫూర్తితో పనిచేస్తున్నట్లు చెప్పారు. "ఈ రోజు 140 కోట్ల మంది భారతీయులు వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన భారతదేశం) కోసం నిశ్చయించుకున్నారు" అని ఆయన ఒక అధికారిక కార్యక్రమంలో అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story