TS : మహిళా సంఘాల సభ్యులకు రూ.10లక్షల ప్రమాద బీమా

TS : మహిళా సంఘాల సభ్యులకు రూ.10లక్షల ప్రమాద బీమా

మహిళా సంక్షేమానికి తెలంగాణలోని (Telangana) కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) తీసుకుంటున్న చర్యలకు బ్రేకులే లేవు. లేడీస్ సంక్షేమానికి టాప్ ప్రయారిటీ ఇస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

స్త్రీనిధి పరపతి సమాఖ్య ద్వారా బీమా అమలు కానుంది. దీనికి సంబంధించిన విధివిధానాలను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో పాటు ఎస్‌హెచ్‌జీ సభ్యులకు రుణబీమాను కల్పిస్తూ జీవో జారీ చేసింది. మహిళా స్వయం సహాయక సంఘాలు తీసుకునే రూ.2 లక్షల వరకు రుణాలకు బీమా కోసం స్త్రీనిధి సమాఖ్యకు రూ.50.41 కోట్లు విడుదల చేసింది. రెండు రోజుల కిందట జరిగిన స్వశక్తి మహిళా సదస్సులో ఇచ్చిన హామీ అమలోకి తేవడానికి ముఖ్యమంత్రి రేవంత్‌ స్వయంగా రంగంలోకి దిగారు.

స్వయం సహాయక సంఘాల మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పించేందుకు వీలుగా శిల్పారామం పక్కన ఉన్న స్థలాన్ని పరిశీలించారు. మంత్రి పొంగులేటి, ఇతర అధికారులతో కలిసి గురువారం స్వయంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. 2017 నుంచి నిరుపయోగంగా ఉన్న నైట్‌ బజార్‌లోని 119 స్టాల్స్‌ను మార్కెటింగ్‌ చేసుకునేలా అన్ని రకాల సదుపాయలతో సిద్ధం చేయాలని చెప్పారు. స్టాల్స్‌ పూర్తిగా మహిళలకు మాత్రమే కేటాయించాలని, ఇందుకు సంబంధించి వీలైనంత తొందరగా ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పారు. మహిళా శక్తి పథకంలో భాగంగా రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.

Tags

Read MoreRead Less
Next Story