TS : 14 సీట్లు మనవే.. రేవంత్ రెడ్డి ధీమా

TS : 14 సీట్లు మనవే.. రేవంత్ రెడ్డి ధీమా

లోక్ సభ వ్యూహాలపై స్పీడు పెంచారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). అభ్యర్థుల ఎంపిక, ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. తెలంగాణలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు టీ- కాంగ్రెస్ ను సిద్ధం చేస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. ఈ సభకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ హాజరుకానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 17 సీట్లకు గాను 14 ఎంపీ సీట్లను గెలిచి తీరాలని రేవంత్ రెడ్డి టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఈ విషయాన్ని కేడర్ కు , లీడర్లకు తెలియజేశారు. ఎన్నికలయ్యేంత వరకు ముఖ్య నేతలందరూ కలిసికట్టుగా బాధ్యతలను పంచుకోవాలనీ, కార్యకర్తల వెన్నంటి ఉండాలని తెలంగాణ నేతలు నిర్ణయించుకున్నారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయిన సీఎం రేవంత్ రెడ్డి గతంలో తమకు విజయం తెచ్చిపెట్టిన మల్కాజిగిరి ఎన్నికల మోడల్‌ను రాష్ట్రమంతటా అనుసరించాలని ఇప్పటికే పార్టీ ముఖ్యులకు రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.

ఒకట్రెండు రోజుల్లోనే అన్ని నియోజకవర్గాల్లో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పార్లమెంట్‌ , అసెంబ్లీ, బూత్‌ స్థాయిల్లో మూడంచెలుగా పార్టీ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తారు. పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయి కమిటీలో ఏఐసీసీ పరిశీలకులతో పాటు అక్కడి పార్టీ ముఖ్యులు సభ్యులుగా ఉంటారు. బూత్‌ స్థాయి కమిటీల్లో ఆ పరిధిలోని చురుకైన పార్టీ సభ్యులు ఐదుగురికి అవకాశం కల్పిస్తారు. బూత్‌ కమిటీలో ఉండే ఐదుగురే ఈ సారి ఎన్నికల్లో అత్యంత కీలక పాత్ర పోషించనున్నారు. బూత్‌ కమిటీల్లో ఉన్న సభ్యులకు భవిష్యత్తులో తగిన గుర్తింపునిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి హామీ ఇస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story