Tragedy : వాటర్ ట్యాంకులో 30 కోతులు మృతి.. అదే నీరు తాగిన జనం

Tragedy : వాటర్ ట్యాంకులో 30 కోతులు మృతి.. అదే నీరు తాగిన జనం

సిటీలైనా.. గ్రామాలైనా వాటర్ ట్యాంకర్స్ అంటేనే జనం తాగునీరుకు ప్రాణాధానం. ఇంటికి తాగు నీరు అందించే ప్రభుత్వ వాటర్ ట్యాంకర్ల నిర్వహణ సరిగా ఉండటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా వాటర్ ట్యాంకర్లో కోతులు పడి చనిపోయిన ఘటన కలకలం రేపుతోంది.

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ హిల్‌ కాలనీలో దారుణం జరిగింది. వాటర్‌ ట్యాంకులో పడి 30 కోతులు ప్రాణాలు కోల్పోయాయి. 200 ఇళ్లకు తాగునీరు సరఫరా చేసేలా ఈ ట్యాంకు నిర్మించి పైన రేకులు వేశారు. కాగా, ఎండలు మండిపోతుండటంతో నీళ్లు తాగేందుకు ట్యాంకులోకి దిగిన కోతులు బయటకు వచ్చేందుకు దారి దొరక్క అందులోనే ప్రాణాలు కోల్పోయాయి. కోతులు మరణించిన విషయాన్ని అధికారులు ఆలస్యంగా గుర్తించారు. బుధవారం నాడు ట్యాంకు నుంచి దాదాపు 30 కోతుల కళేబరాలను వెలికితీశారు.

ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కేటీఆర్ సోషల్ మీడియాలో కడిగిపారేశారు. తెలంగాణ కొత్త ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ సిగ్గుపడాలని అన్నారు. పీరియాడికల్ క్లీనింగ్, రొటీన్ మెయింటెనెన్స్ మరిచిపోయారన్నారు. పాలిటిక్స్ ను పక్కన పెట్టి జనం ప్రాణాలపై ప్రభుత్వం దృష్టిపెట్టాలన్నారు కేటీఆర్. అటు జనం కూడా మండిపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story